Home » సోనూ సూద్ అన్ని కోట్ల ఆస్తిపరుడా..?

సోనూ సూద్ అన్ని కోట్ల ఆస్తిపరుడా..?

by AJAY
Ad

రియల్ హీరో సోనుసూద్ పరిచయం అక్కర్లేని పేరు. హీరో అవ్వాలనే కోరికతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సోనూసూద్ విలన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో సోను సూద్ నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా అరుంధతి, జులాయి సినిమాలలో విలన్ గా సోనూసూద్ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.

Sonu Sood

Sonu Sood

అయితే ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన సోనుసూద్ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. దానికి కారణం సోనూసూద్ చేపట్టిన సేవా కార్యక్రమాలే.. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ ప్రారంభంలోనే సోనూ తన సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఎంతో మందిని తన సొంత డబ్బులతో స్వగ్రామాలకు తరలించారు. ఇక సెకండ్ వేవ్ సమయం లోనూ అదే రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన డబ్బులతో ఆపరేషన్లు చేయించడం …ఆక్సిజన్ లు సరఫరా చేయడం, మందులు ఉచితంగా ఇవ్వడం.. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.

Advertisement

Advertisement

అయితే ప్రజల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్న సోనూసూద్ ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. సోనూ సూద్ కెరీర్ మొదటి నుండి అన్ని భాషల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొన్ని బ్రాండ్లకు వ్యవహరిస్తున్నారు. వాటితో పాటు రెస్టారెంట్ వ్యాపారం కూడా సోనూకు ఉన్నట్టు తెలుస్తోంది. అలా కష్టపడుతూనే సోనూ సూద్ మొత్తం 130 కోట్ల ఆస్తి పాస్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సోనూసూద్ కు అవకాశాలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading