Home » సొంతం సినిమా హీరోయిన్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

సొంతం సినిమా హీరోయిన్ గుర్తుందా…? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…?

by AJAY
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి హీరోయిన్ లలో నేహా పెండ్సే కూడా ఒకరు. నేహా పెండ్సే అనే పేరు చెప్తే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఒకప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో సొంతం సినిమాతో నేహా ప్రేక్షకులకు పరిచయం అయింది.

Advertisement

ఈ సినిమా మంచి విజయం సాధించింది. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమాతో నేహా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2003లో గోల్ మాల్ అనే సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ 2008లో వీధి రౌడీ సినిమాలో నటించింది. ఆ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. అంతేకాకుండా ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. నేహా తెలుగుతోపాటు తమిళ, మరాఠీ, హిందీ సినిమాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా 2018లో బిగ్ బాస్ రియాలిటీ షో లోకి ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

బిగ్ బాస్ ద్వారా చాలామంది మనసు దోచుకుంది. నిజానికి సినిమాల్లోకి రాకముందు ఈ బ్యూటీ టీవీ సీరియల్స్ లో నటించింది. 1995 నుండి నేహా హిందీ సీరియల్స్ లో నటిస్తోంది. అలా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక ప్రస్తుతం హిందీలో ఎంతో పాపులర్ అయిన బాజీజీ ఘర్ పర్ హై అనే సీరియల్ లో నటిస్తోంది. ఇక నేహా సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. తరచూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఇక ఒకప్పుడు తెలుగులో రాణించిన ఈ బ్యూటీ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading