ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీని నిలబెట్టే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ కాంగ్రెస్ లో ప్రక్షాళన మొదలు పెట్టారు. నిన్న సోనియా గాంధీ గులాం నభీ ఆజాద్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన సోనియా కు కొన్ని సూచనలు చేశారు.
Advertisement
Advertisement
ఆజాద్ సూచనల మేరకు సోనియమ్మ ఎఐసీసి లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. పార్టీ లో ఉన్న అసమ్మతి నేతల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని సోనియా గాంధీ ఆజాద్ కు హామీ ఇచ్చారట. అంతే కాకుండా వచ్చే ఏడాది కర్ణాటక లో ఎన్నికలు ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల బాధ్యతలను కూడా సోనియా గాంధీ ఆజాద్ కు అప్పగించారని సమాచారం. అంతే కాకుండా ఇప్పటికే సోనియా గాంధీ రీసెంట్ గా జరిగిన ఐదు రాష్ట్రాల పిసిసి ల స్థానంలో కొత్త పీసిసి లను నియమించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.