Home » రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ ని చెప్పిన సోనియా గాంధీ.. చివరి లైన్ హార్ట్ టచింగ్!

రాజీవ్ గాంధీతో తన లవ్ స్టోరీ ని చెప్పిన సోనియా గాంధీ.. చివరి లైన్ హార్ట్ టచింగ్!

by Bunty
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎక్కడో, ఎప్పుడో చిగురిస్తుంది. దీనికి ఎవరు అతీతులు కారు. పెద్దపెద్ద స్థాయిలో ఉన్నవారు సెలబ్రిటీలు సైతం సామాన్యులను చూసి ప్రేమలో పడిపోతూ ఉంటారు. అలా రాజీవ్ గాంధీ, సోనియా గాంధీని చూసి ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం విచిత్రం. కలయిక అమోఘం. పెళ్లి ఓ వండర్ అంటున్నారు సోనియా గాంధీ. మరి ఎంతోమందిని ప్రేరేపించేలా ఉన్న వీరి ప్రేమ కథ ఎలా ఉందో ఆమె మాటల్లోనే ఇప్పుడు చూద్దాం. ఏం జరిగిందో తెలియదు, అసలేం జరిగిందో అసలు తెలియదు. ఆ చిరునవ్వు, ఎత్తు, ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే ఆ కళ్ళు, తేజస్సు, నేను మొదట చూసినప్పుడు ఎంతసేపు చూసానో నాకే తెలియదు, నాతోటి మిత్రుడిని అడిగాను. ఇంత అందంగా ఉన్నాడు. ఎవరు ఇతను అని, భారతీయుడు పండిట్ నెహ్రూ గారి కుటుంబం అని చెప్పారు. నేను ఆ మాటలు వింటూ అలా చూస్తుండిపోయాను.

Advertisement

మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. ఆయనను చూస్తున్న రోజులు ఎంత సంతోషంగా ఉండేవో, అదొక స్వర్గం, ప్రేమలో మేము ఎంతో ఆనందించాం. అసలు మేము ప్రేమను ఒకరికొకరం వ్యక్తపరచుకున్నట్లు జ్ఞాపకం కూడా లేదు. ఇక్కడ ప్రతిదీ సహజమైనది, మేము ఒకరికోసం ఒకరం పుట్టాం అనుకున్నాం, అప్పుడే మేము కలిసి జీవించాల్సిన టైం వచ్చింది అనుకున్నాం. ఇందిరా గాంధీ గారు ప్రధాని అయ్యారు. ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు కొంత బయస్తులు గానే ఉన్నారు. మా పెళ్ళికి మీ అనుమతి కావాలని అడిగాం. మమ్మల్ని భారతదేశం రావాలని కోరారు.

Advertisement

నేను ప్రపంచంలో ఏ మూలనైనా రాజీవ్ తో కలిసి బ్రతుకుతాను అన్న ధైర్యం నాకు ఉండేది. ఇందిరాజి పెళ్లిలో నెహ్రూజీ బహుకరించిన గులాబీ చీర నాకు ఇచ్చారు. నేను అదే ధరించాను. నేను, రాజీవ్ ఒకటయ్యాము. నా కల నిజమైన వేళ, నేను రాజీవ్ కొత్త జీవితాన్ని ఆరంభించి ఇక్కడే సంతోషంగా గడిపాను. రోజులు ఎలా గడిచాయో తెలియదు. రాజీవ్ సోదరుడు విమాన ప్రమాదంలో మరణించాడు. అప్పుడే రాజీవ్ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ తర్వాత నాకోసం తక్కువ సమయం వెచ్చించేవాడు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇందిరాజీ మరణం. ఆ తర్వాత నేను కూడా రాజీవ్ జీవితంలో ముఖ్యపాత్ర పోషించాను. ప్రేమించిన మనిషి శవాన్ని చూడడం ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు, చివరిగా నా రాజీవ్ ని నాకు తిరిగి ఇవ్వండి. తీసుకొని వెళ్ళిపోతాను, తిరిగి రాకపోతే ఆయన కలిసిన మట్టిలోనే నన్ను కలిపేయండి, అని ఎమోషనల్ గా సోనియాగాంధీ చెప్పారు.

READ ALSO : రెబల్, మిరపకాయ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Visitors Are Also Reading