Telugu News » Blog » హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ఇంట్లో రూ.1.41కోట్ల చోరీ…!

హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ఇంట్లో రూ.1.41కోట్ల చోరీ…!

by AJAY
Ads

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ అత్త‌గారి ఇంట్లో భారీ దొంగ‌త‌నం జ‌రిగింది. సోన‌మ్ క‌పూర్ ఆనంద్ అహుజాను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ప్ర‌స్తుతం త‌న భ‌ర్త ఆనంద్ తో క‌లిసి ఢిల్లీలోని తుగ్ల‌క్ రోడ్డు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో నివాసం ఉంటున్నారు. వీరితో పాటూ సోన‌మ్ క‌పూర్ అత్త‌మామ కూడా ఇదే ఇంటిలో ఉంటున్నారు. కాగా ఇంట్లో నుండి రూ.1.41 కోట్ల విలువైన డ‌బ్బు మ‌రియు బంగారు ఆభ‌రణాలు మాయం అవ్వ‌డం ఇప్ప‌డు క‌ల‌కలం రేపుంతోంది.

ఈ ఘ‌ట‌న పై సోన‌మ్ క‌పూర్ అత్త ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. ఇంట్లో పనిచేస్తున్న డ్రైవ‌ర్లు మ‌రియు కేర్ టేక‌ర్ లు ఇత‌ర సిబ్బంధిని విచారిన్నారు.వీరితో పాటూ అనుమానం ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు పోలీలుసు ఎంతో శ్ర‌మిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా సోన‌మ్ క‌పూర్ ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా సోన‌మ్ బేబీ బంప్ తో సోష‌ల్ మీడియాలో ఫోటోల‌ను షేర్ చేయ‌గా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి. ఇక త‌మ మొద‌టి బిడ్డ కోసం సోన‌మ్ ఆనంద్ లు ఎదురు చూస్తున్న సమ‌యంలో ఇలాంటి వార్త విన‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్న‌రు. ఇదిలా ఉంటే సోన‌మ్ కపూర్ బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అయితే పెళ్లి త‌ర‌వాత మాత్రం సోన‌మ్ కపూర్ సినిమాల‌కు కాస్త దూరంగానే ఉంటుంది.


You may also like