తన విలనిజంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ నటుడు రఘువరన్. తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ భాషల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్నారు. పసివాడి ప్రాణం,శివ వంటి సినిమాల్లో విలన్ గా, అంజలి వంటి క్లాసిక్ మూవీ లో తండ్రిగా అద్భుత నటనను కనబరిచారు. ఆయన మొదట్లో హీరోగా, తర్వాత విలన్ గా,చివరిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ తరహా పాత్ర వేసిన ఆ పాత్రలో ఇమిడిపోయి మెప్పించగలిగాడు.
Advertisement
రఘువరన్ గారు ఫేడ్ అవుట్ అవుతున్న క్రమంలో ప్రకాష్ రాజ్ లాంటి కొత్త విలన్ వచ్చారు.దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. దీంతో మందుకు బానిసై కాలేయం దెబ్బతింది. ఆ ఎఫెక్ట్ ఇతర అవయవాల మీద కూడా పడింది. దాంతో ఆయనకు యాభై ఏళ్ళు నిండకముందే నూరేళ్ళు నిండిపోయాయి. రఘువరన్, రోహిణి గార్లకు బాబు రిషి వరన్ పుట్టారు. రఘువరన్ నిజానికి మంచి సంగీతకారుడు, గాయకుడు కూడా అని ఆయన భార్య రోహిణి గారు చెప్పారు.కానీ వాటి మీద దృష్టి పెట్టమంటే నేను మల్టీటాస్కింగ్ చేయలేను నటనలో ఉంటూ మిగతా వాటిపై దృష్టి పెట్టలేను అనేవారట. కాని చనిపోయే కొన్ని రోజుల ముందు ఆయన కొన్ని పాటలు పాడి వీడియో తీశారు. వాటిని నేను సేకరించి ఈమధ్య వీడియో ఆల్బమ్ గా తయారు చేశాను.
Advertisement
దాన్ని రజినీకాంత్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసమే మా అబ్బాయి రిషి తొలిసారి మీడియా ముందుకు వచ్చారు అంటూ రోహిణి చెప్పుకొచ్చింది. రఘువరన్ కొడుకు అమెరికాలో ప్రీమేడ్ డిగ్రీ చదువుతున్నట్లుగా రోహిణి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ALSO READ;
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య ఎవరో తెలుసా…? ఆమె ఏం చేస్తారంటే…!
నేను హీరోగా చేస్తుంటే మిగితా హీరోలు అందరూ కలిసి…?