Home » రాధేశ్యాం నుంచి మ‌రో అప్డేట్..సెకండ్ సింగిల్ టీజర్ రిలీజ్

రాధేశ్యాం నుంచి మ‌రో అప్డేట్..సెకండ్ సింగిల్ టీజర్ రిలీజ్

by Bunty
Ad

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్… ఏ మాత్రం తగ్గకుండా… దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ రాదే శ్యాం. ప్రభాస్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ… తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

Advertisement

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీచర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మరో బిక్ అప్ డేట్ వచ్చింది. సోచెలియా అంటూ సాగే రెండో సింగిల్ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ ను హిందీ వెర్షన్ లో విడుదల చేస్తోంది చిత్రబృందం.

ఈ సాంగ్ టీజర్ వివరాల్లోకి వెళితే… విరహ వేదనలో ప్రభాస్ మరియు పూజ ప్రేమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కనిపించారు. ఈ సాంగు లోనూ అదిరిపోయే విజువల్స్ ను చూపించారు దర్శకుడు రాధాకృష్ణ. ఈ ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 8వ తారీకున విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. మొత్తానికి ఈ సాంగ్ టీజర్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది.

Visitors Are Also Reading