మనం దానిమ్మ పండ్లు తిన్నప్పుడు దాని లోపల గింజలను తిని తొక్కను బయటపడేస్తూ ఉంటాం.. కానీ ఆ తొక్కకు చాలా వాల్యూ ఉంటుంది.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
చర్మం అందంగా తయారవుతుంది:
దానిమ్మ తొక్కలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచి పీహెచ్ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది.
జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది :
దానిమ్మ తొక్కలో ఉండే టానిన్లు పేగు మంటను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు.
Advertisement
also read:మహేష్ బాబు అభిమానులకు శుభవార్త.. ఒక్కడు రీ రిలీజ్ అప్పుడే..!
Advertisement
ఇమ్యూనిటీ పెంచుతుంది :
దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ నోటి పూతను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఈ దానిమ్మ తొక్క టి దగ్గు,గొంతు నొప్పి, జలుబు వంటివి దరిచేరకుండా చేస్తుంది. సీజనల్ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.
దంతాలు ఆరోగ్యం:
దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ కరిస్ ప్రభావాలు దంత క్షయం, నోటి పూత వంటి సమస్యలను దూరం చేస్తుంది.
తయారీ విధానం:
దానిమ్మ తొక్కలను తీసుకొని బాగా ఎండబెట్టాలి. సూర్యరశ్మి లేదా మైక్రోవేవ్ లో కాల్చొచ్చు.. అలా బాగా ఎండిన తర్వాత గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక ఖాళీ టీ బ్యాగు తీసుకొని అందులో ఒక టీ స్పూన్ దానిమ్మ తొక్క పొడి వేసి దాన్ని మూసివేయండి. ఆ తర్వాత నీటిని మరిగించి దానిలో టీ బ్యాగును వేయండి.. ఇంకేముంది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే టీ రెడీ..
also read:కృష్ణకు ఘోర అవమానం.. పద్మాలయ స్టూడియోలోకి వెళ్లకుండా ఆపారు.. ఎందుకో తెలుసా ?