ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటూ ఉంటారు పెద్దలు. కానీ మన తెలుగు బుల్లితెర తారలు కొందరు నలభైకి దగ్గరగా వస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను గడుపుతున్నారు. అలా సింగిల్ గా ఉంటున్న తారలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
Ad
టాలీవుడ్ లోని టాప్ యాంకర్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు. చాలా కాలం నుండి ప్రదీప్ పెళ్లి పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పెళ్లి మాత్రం జరగలేదు. ఇక ప్రదీప్ వయసు ప్రస్తుతం 37 కాగా ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు.
ALSO READ : మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!
యాంకర్ రష్మి జబర్దస్త్ షో ద్వారా అభిమానులను సంపాదించకుంది. రష్మి వయసు గూగుల్ ప్రకారం 34 ఉంది కానీ చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ వయసు ముప్పై ఐదు పైనే అని ప్రచారం ఉంది. ఇక రష్మి కూడా స్టిల్ సింగిల్ గానే ఉంది.
జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు. హైపర్ ఆది కమెడియన్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్నాడు. తోటి కమెడియన్ లు పెళ్లి చేసుకుని పిల్లలకు జన్మనిచ్చినా ఆది మాత్రం బ్యాచిలర్ గానే ఉన్నాడు. మరో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి చేసుకోలేదు. సుధీర్ హీరోగా సైతం సినిమాలు చేస్తున్నాడు. కాగా కెరీర్ బిజీలో పెళ్లిని పక్కన పెట్టేశాడు.
యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం యాంకర్ గా మరియు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది.ఇక విష్ణు ప్రియ కూడా ఏజ్ 37 వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోయింది.
Advertisement
ALSO READ : మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!