వర్షాకాలంలో వర్షాలు కురవడం అనేది కామన్. ఆ సమయంలోనే నదులు, సరస్సులు ఫుల్ గా నీటితో నిండిపోతుంటాయి. ఈ సీజన్ హాయిగా ఉన్నట్లు అనిపించినప్పటికీ.. హడలు పుట్టించే వ్యాధులను కూడా తీసుకొస్తూ ఉంటుంది. ఈ సీజన్ మొదలయ్యేటప్పటికీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలు పెట్టాలి. లేదంటే సూచనలేని వర్షాల కారణంగా వ్యాధుల బారిన పడక తప్పదు.
Advertisement
వర్షాకాలంలో ఎక్కువగా చర్మంపై ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. తగినంత సూర్య కాంతి, గాలి లేకపోవడం వలన ఈ సీజన్ లో అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తేమ కారణంగా చర్మంపై చెమట పొర ఉంటుంది. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Advertisement
ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కాలి వేళ్లు, గజ్జ ప్రాంతం, తొడల లోపలి భాగం, తుంటి, కళ్ల మధ్య చర్మంపై వస్తుంటాయి. అథ్లెట్స్ ఫుట్, రింగ్‌వార్మ్, టినియా క్రూరిస్, గోరు ఫంగస్ (సాధారణంగా గోర్లలో వస్తుంటుంది) కాన్డిడియాసిస్, ఆస్పెర్‌గిలోసిస్, ఫంగల్ కెరాటిటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఫంగల్ కెరాటిటిస్ అనేది కంటి కార్నియా కు వచ్చే ఇన్ఫెక్షన్. దీని ప్రభావం కంటి చూపుపై తీవ్రంగా పడుతుంది. అందుకే వాన కాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అస్తమానం నీటిలో తడవకుండా.. శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. శరీరానికి గాలి తగిలేలా దుస్తులు ధరించడం, చర్మం పొడిబారకుండా కాపాడుకోవడం చేయాలి. వర్షాకాలానికి అనువైన దుస్తులను ధరించాలి. ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!
హరికృష్ణ చివరి కోరిక ఇదేనట..ఇన్నాళ్లకు బయట పడింది !
నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ?