Skanda Review : టాలీవుడ్ హీరో రామ్ పోతినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మధ్య కాలంలో సక్సెస్ లేక సతమతమౌవుతున్నాడు రామ్ పోతినేని. ఈ తరుణంలోనే.. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన స్కంద మూవీ గురువారం పాన్ ఇండియన్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ క్యారెక్టర్ లో రామ్ కనిపించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేశాడు. ఇందులో రామ్ కు జోడిగా శ్రీలీల హీరోయిన్ గా నటించింది. యూత్ లో ఆమెకున్న క్రేజ్ కూడా స్కందకు ప్లస్ అయ్యింది.
కథ మరియు వివరణ :
Advertisement
రామ్ పోతినేని హీరోగా చేసిన స్కంద సినిమా కథ విషయానికి వస్తే… రాయలసీమలోని ఓ చిన్న పల్లెటూరులో నివసించే రామ్ తండ్రికి ఊర్లో మంచి పేరు ఉంటుంది. అతను ప్రజలకు కావలసిన సహాయం చేస్తూ న్యాయం కోసం పోరాడుతాడు. రామ్ ది సైతం అలాంటి లక్షణమే. ఇక శ్రీలీల ఓ సంపన్న భూస్వామి కూతురు. మంచి చురుకైన అమ్మాయి. ఇద్దరు కూడా ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై ప్రేమించుకుంటారు. కానీ వారి ప్రేమ కుటుంబాలకి నేరమవుతుంది. శ్రీలీల కుటుంబాన్ని రామ్ తండ్రి అంగీకరించడు. శ్రీలీల తండ్రి రామ్ కుటుంబాన్ని అంగీకరించడు.
Advertisement
రెండు కుటుంబాలు శత్రువులు కావడంతో తమ పిల్లలను వేరుగా ఉంచాలని నిశ్చయించుకుంటారు. ఈ క్రమంలో రామ్ కి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. ఎన్నో సవాళ్లను, శత్రువులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని రామ్ ఎలా ఎదుర్కొన్నాడు… శ్రీ లీల ప్రేమని దక్కించుకున్నాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాకు యుఎస్ నుంచి కూడా బాగుందనే టాక్ వచ్చింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో స్కంద సినిమా మొదటి ఆట అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయని తెలుస్తోంది. ఎలాగో స్కూల్స్ కి హాలిడే కాబట్టి ఈ సినిమాకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. రామ్ బోయపాటి ఇద్దరూ కలిసి చేసిన ఈ స్కంద మాస్ ఆడియన్స్ కు మంచి ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో బొయపాట శ్రీను మరియు రామ్ యాక్టింగ్ అదిరిపోయింది.
ప్లస్ పాయింట్స్:
కథ
రామ్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
కామెడీ మిస్సింగ్
రేటింగ్ 3/5
ఇవి కూడా చదవండి
- వచ్చే ఎన్నికల్లో చంద్రసేనదే విజయం..160 సీట్లు పక్కా – అశ్వినీదత్
- పాకిస్తాన్ ఆటగాళ్లకు వీసాలు ఎందుకు ఆలస్యం అయ్యాయి..ఇండియా కావాలనే చేసిందా ?
- హీరోయిన్ రాశి, వేణు మధ్య అలాంటి రిలేషన్ ఉందా..?