సాధారణంగా తమిళ హీరో శివ కార్తికేయన్ మూవీ వస్తోందంటే తెలుగు సినీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది. రెమో, డాక్టర్, డాన్, ప్రిన్స్, మహావీరుడు వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కథ విషయంలో శివకార్తికేయన్ కాస్త ప్రయోగాలు చేస్తుంటాడు. అలాంటి ఒక ప్రయోగం నుంచి వచ్చిందే సైన్స్ ఫిక్షన్ అయలాన్ మూవీ. వాస్తవానికి ఈ సినిమా జనవరి 12న విడుదలైంది. కానీ సంక్రాంతి బరిలో థియేటర్లకు ఇబ్బంది కలగడంతో తెలుగులో విడుదలను వాయిదా వేశారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అయలాన్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
నటీనటులు : శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, తదితరులు
దర్శకత్వం : ఆర్.రవికుమార్
నిర్మాత : కోటపాడి జే రాజేష్
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
కథ మరియు విశ్లేషణ :
ఒక ఏలియన్ భూమి మీదకు వస్తుంది. అది తమీజ్ (శివకార్తికేయన్) అనే యువకుడిని కలుస్తుంది. అమీజ్ అతని స్నేహితులు టైసన్(యోగిబాబు), సుగిర్త రాజా(కరుణాకరన్) కలిసి ఏలియన్ కి టట్టూ అని పేరు పెడతాడు. ఇక ఆ టట్టూతో యోగిబాబు, కరుణాకరన్ చాలా తిప్పలే పడుతారు. ఇక ఆ తరువాత టట్టూ కొందరి చెడు వ్యక్తుల చెరలోకి చిక్కుతుంది. అక్కడి నుంచి తమీజ్, అతని స్నేహితులు టట్టూని ఎలా కాపాడారు..? అసలు టట్టూ భూమి మీదకు ఎందుకు వచ్చాడు..? భూమిని ఏ ప్రమాదం నుంచి కాపేడేందుకు ప్రయత్నిస్తాడు..? టట్టూ తిరిగి తన ప్లానెట్ కి క్షేమంగా వెళ్లాడా..? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే అయలాన్ మూవీని థియేటర్లలో వీక్షించాల్సిందే.
Advertisement
సాధారణంగా సైన్స్ ఫిక్షన్ మూవీస్ ని తెరకెక్కించాలంటే కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. అలాంటి సహాసాన్ని చేసేందుకు డైరెక్టర్ రవికుమార్ ఎక్కడా సంకోచించలేదు. తన కెరీర్ లో రెండో సినిమాకే అంతటి బాధ్యతను మోసినందుకు రవికుమార్ ని మెచ్చుకోవాల్సిందే. గత సినిమాలను పోల్చితే. అయలాన్ మూవీ చాలా బాగా నచ్చుతుంది. చిన్నపిల్లలు చాలా ఆసక్తిగా చూస్తారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో డైరెక్టర్, మేకర్స్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ఒక సీరియస్ విషయాన్ని ప్రేక్షకులను మెప్పించే విధంగా.. హాస్యాస్పదంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ సాధించాడు. శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడు. శివకార్తికేయన్ తరువాత క్రెడిట్స్ దక్కేది మాత్రం టట్టూకే అని చెప్పాలి. కొన్ని సీన్స్ లో శివకార్తికేయన్ కి మించి టట్టూ ప్రయారిటీ ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, యోగిబాబు, కరుణాకరన్ వారి పాత్రలకు న్యాయం చేశారు. నెగిటివ్ పాత్రలో ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్ అద్భుతంగా నటించారు.
పాజిటివ్ పాయింట్స్ :
- శివ కార్తికేయన్, టట్టూ
- A.R.రెహమాన్ సంగీతం
- కథనం
- సినిమాటో గ్రఫీ
మైనస్ పాయింట్స్ :
- అక్కడక్కడ సాగదీత
- లాజిక్ లేని కొన్ని సీన్స్
రేటింగ్ 2.75 / 5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!