Home » సీతారామం లాభాలు ఇంత తక్కువ…?

సీతారామం లాభాలు ఇంత తక్కువ…?

by Azhar
Ad
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా తాజాగా వచ్చిన సినిమా సీతారామం. ఈ సినిమాతో పాటుగా విడుదలైన బింబిసారా సినిమా రెండు కూడా మంచి హిట్ ను అందుకున్నాయి. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో ఈ రెండు హిట్లు టాలీవుడ్ ను కష్టాల్లో నుండి బయటకు తెచ్చాయి అనే చెప్పాలి. అయితే ఈ సినిమా ఉయికదా పెద్ద హిట్ కావడంతో హిందీలో కూడా సినిమాను విడుదల చేయాలి అని చాలామంది అన్నారు.
ఇక అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఈ నెలలోనే హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేయగా.. అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. దాంతో.. సీతారామం పై చర్చ అనేది ఎక్కువ మొదలయింది. ఇక ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన ఈ సీతారామం సినిమా.. ఇక్కడ కూడా మంచి స్పందనే తెచ్చుకుంది అనే నిజం. దాంతో ఈ సినిమాను నిర్మించిన వైజయంతి బ్యానర్ కు భ్రిగా లాభాలు వచ్చాయి అని అనుకుంటున్నారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీతారామం సినిమాకు అంత ఎక్కువ లాభాలు అనేది రాలేదు అని తెలుస్తుంది. ఈ సినిమాకు మొత్తం 51 కోట్లు ఖర్చు చేయగా.. దానిని రాబట్టిన సీతారామం.. ఎక్కువగా 20 కోట్లు వసూల్ చేసింది అని తెలుస్తుంది. అయితే 20 కోట్ల లాభాలు అనేది చిన్న విషయం కాదు. కానీ ఈ సీతారామం భారీ హిట్ అనేదానికి.. ఇది సాధించిన 20 కోట్ల లాభాలు అనేవి తక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Visitors Are Also Reading