Home » సీతారామం హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

సీతారామం హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఈ మధ్యే కాలంలో విడుదల అయిన అన్ని సినిమాలు అనేవి ప్లాప్ కావడంతో ఇండస్ట్రీ కష్టాలో పడిపోయింది. అటువంటి సమయంలో ఒక్కే రోజు విడుదల అయాన్ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అవే బింబిసారా మరియు సీతారామం. ఇక ఈ రెండు సినిమాలు కూడా టాలీవుడ్ కు ఊపిరి పోశాయి. అయితే కలెక్షన్స్ ప్రకారం చూస్తే సీతారామం కొంచెం ముందంజలో ఉంది. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే 75 కోట్ల వరకు వసూల్ చేసింది.

Advertisement

ఇదిలా ఉంటె ఈ మధ్య మన సౌత్ ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీలో సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం మన కార్తికేయ 2 సినిమా హిందీలో ఎదురు లేకుండా నడుస్తుంది. అక్కడ వస్తున్న బాలీవుడ్ సినిమాలు అనేవి ప్రజలకు ఎక్కువగా నచ్చడం లేదు అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇటువంటి సమయంలో ఇక్కడ హిట్ అయిన ఈ సీతారామం సినిమాను కూడా హిందీలో విడుదల చేస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకున్నారు.

Advertisement

ఇక అందుకు తగిన విధంగానే చిత్రబృందం కూడా సీతారామం హిందీ విడుదలకు మొత్తం సిద్ధ చేసే పనిలో పడిపోయింది. అయితే మన తెలుగులో విడుదల అయ్యి నెల కావస్తున్నా సమయంలో ఇంకా ఎప్పుడు ఈ సినిమా విడుదల ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. ఇక దీనిపై చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమా సీతారామం డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి అని.. వచ్చే నెల 2న ఈ సినిమా హిందీలో విడుదల అవుతుంది అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

Visitors Are Also Reading