Home » ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నటి సీత తన భర్త తో అందుకే విడిపోయిందా…?

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నటి సీత తన భర్త తో అందుకే విడిపోయిందా…?

by AJAY

టాలీవుడ్ న‌టి సీత ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించిన సీత ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. ఆన్ పావమ్ అనే త‌మిళ సినిమా ద్వారా సీత ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచయ అయ్యింది.ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర‌వాత తెలుగు, త‌మిళ్ తో పాటూ మ‌లయాళ చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. సీత పార్తీవ‌న్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌నే హీరోగా న‌టించిన పుదియ‌పామై సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

ఈ సినిమా షూటింగ్ లో స‌మయంలోనే పార్తీవ‌న్ సీత ప్రేమించుకున్నారు. వివాహం చేసుకున్న త‌ర‌వాత వీరిగి ముగ్గురు సంతానం క‌లిగారు. అయితే పెళ్లైన ప‌ద‌కొండేళ్ల‌కు సీత పార్తీవ‌న్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల త‌ర‌వాత 43 ఏళ్ల వ‌య‌సులో సీత సీరియ‌ల్ న‌టుడు సతీష్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఆ త‌ర‌వాత కొంత కాలానికే వీరిద్ద‌రూ కూడా విడిపోయారు.

అయితే రీసెంగ్ ఓ ఇంటర్వ్యూలో విడాకుల‌కు సీత‌నే కార‌ణమని పార్తీవ‌న్ వెల్ల‌డించారు. దాంతో ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారారు. .ఓ ఇంట‌ర్వ్యూలో పార్తీవ‌న్ మాట్లాడుతూ…తాము విడిపోవ‌డానికి సీత‌నే కార‌ణం అని చెప్పారు. సీత అత్య‌శ వ‌ల్ల‌నే తాము విడాకులు తీసుకున్నార‌ని చెప్పారు.

త‌న మాజీ భ‌ర్త చేసిన కామెంట్ల పై సీత స్పందించారు. తాను మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుండి వ‌చ్చాన‌ని చెప్పారు. ఓ సినిమాలో సుహాసిని చెప్పిన విధంగా నా భ‌ర్త నాకే సొంతం అని ఆశించ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. అంతే కాకుండా పార్తీవ‌న్ చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే అంటూ సీత ఫైర్ అయ్యారు. ఇక సీత టాలీవుడ్ లో చాలా సినిమాలు చేయ‌డంతో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Visitors Are Also Reading