దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతారామం. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సుమంత్, రష్మిక మందన, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ మరికొందరు నటులు ముఖ్యపాత్రలో నటించారు. ఇప్పటికే ఈ రొమాంటిక్ సినిమా ట్రైలర్ మరియు టీజర్ లు విడుదల కాగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read: నటి అర్చన:వివాహమైందని రెమ్యూనరేషన్ తగ్గిస్తా మన్నారు.. మరి పిల్లలున్న హీరోలకు ఎందుకు తగ్గించరు..!!
Advertisement
Sitaramam Movie Review and Rating
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా నిర్వహించింది. సినిమా టీజర్ ట్రైలర్ లు బాగుండడం…. హనురాగవపూడి దర్శకత్వం…భారీ తారాగణం సినిమాలో ఉండటం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సినిమా రీచ్ అయ్యిందా….? లేదా..? అన్నది ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ & కథనం
సీతారామం సినిమా పిరియాడిక్ ప్రేమ కథ నేపథ్యంలో తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో యుద్ధం లోనే ప్రేమ పుడుతుంది అని చూపించారు. ఒకప్పుడు ప్రేమలేఖల అనుభూతి ఎలా ఉండేది…..స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుంది అనేదాన్ని చక్కగా చూపించాడు. ఆర్మీ లో అనాథగా ఉన్న దుల్కర్ సల్మాన్ కు నేను నీకు తోడుగా ఉన్న అంటూ హీరోయిన్ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. హీరో హీరోయిన్ ల మధ్య అస్సలు ప్రేమ ఎలా పుడుతుంది..? వారి ప్రేమకు ఏం అడ్డు వస్తుంది..? రష్మిక కు దుల్కర్ తో సంబంధం ఏమిటి. ఎందుకు వారిద్దరి కోసం అంతలా వెతుకుతుంది అన్నదే ఈ సినిమా కథ.
హనురాగపూడి దర్శకత్వం తో విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే రష్మిక పాత్రకు మించినట్టించిందా అన్నట్టుగా కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లలో దర్శకుడు లాజిక్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఎంతో నచ్చేస్తుంది. అంతేకాకుండా సినిమాలోని పాటలు విజువల్స్ ప్రేక్షకులను మైమరిపిస్తాయి.
Also Read: Bimbisara movie review: కళ్యాణ్ రామ్ “బింబిసార” రివ్యూ…!