Home » “శ్యామ్ సింగరాయ్” నుంచి ఓ బిగ్ అప్డేట్.. సిరివెన్నెల చివరి పాట విడుదల

“శ్యామ్ సింగరాయ్” నుంచి ఓ బిగ్ అప్డేట్.. సిరివెన్నెల చివరి పాట విడుదల

by Bunty
Ad

టక్ జగదీష్ సినిమాతో పెద్ద డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ తదుపరి సినిమా ఆయన “శ్యాం సింగరాయ్” పైనే పెట్టుకున్నారు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్యూటీ కృతి శెట్టి, ప్రేమమ్ మడోన్నా సెబాస్టియన్ మరియు సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అటు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు.. టీజర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటను.. ఇవాళ శ్యాం సింగరాయ్ విడుదల చేసింది. “నెల రాజుని… ఇల రాణి నీ కలిపింది కదా.. సిరివెన్నెల”అనే లిరిక్స్ తో ఈ సాంగ్ ప్రారంభం అయింది.

Advertisement

ఇక ఈ పాటలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ముద్ర స్పష్టంగా కనిపించింది. పాట పూర్తయ్యేవరకు… సాగిన లిరిక్స్ అందరి మనసులను దోచే స్తున్నాయి. అటు సాయి పల్లవి మరియు నాని మధ్య కోఆర్డినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి ఈ సాంగ్ శ్యాం సింగరాయ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమాను ఈనెల 24వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Visitors Are Also Reading