Home » సిరి శ్రీహాన్ కూడా విడిపోతున్నారా..అత‌డి ఎమోష‌న‌ల్ పోస్ట్ అర్థ‌మేంటి..?

సిరి శ్రీహాన్ కూడా విడిపోతున్నారా..అత‌డి ఎమోష‌న‌ల్ పోస్ట్ అర్థ‌మేంటి..?

by AJAY

బిగ్ బాస్ సీజ‌న్ 5 పూర్తి అయ్యాక లేని పోని గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ష‌ణ్ముక్ కు దీప్తి బ్రేక‌ప్ చెప్పేసింది. బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముక్ కు సిరి చాలా క్లోజ్ గా ఉండ‌టం ఇద్ద‌రూ ముద్దులు హగ్గుల‌తో హ‌ద్దులు మీర‌డం వ‌ల్లే ఇద్ద‌రికీ బ్రేక‌ప్ జ‌రిగింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అంతే కాకుండా బిగ్ బాస్ కు ముందు ష‌ణ్ముక్ దీప్తి చాలా భాగా ఉన్నారు. హౌస్ లోకి వెళ్లిన త‌ర‌వాత కూడా దీప్తితో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ష‌ణ్ముక్ ను ఫోన్ మాట్లాడించారు. ష‌ణ్ముక్ కూడా అప్పుడ‌ప్పుడు దీప్తిని త‌లుచుకుని బాధ‌ప‌డేవాడు.

ఇక్క‌డ వ‌ర‌కూ అంతా భాగానే ఉంది. ష‌ణ్ముక్ భ‌య‌ట‌కు రాగానే దీప్తి వెల్ క‌మ్ చెబుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ దీప్తి అస‌లు ష‌ణ్ముక్ ను క‌ల‌వ‌లేదు. దాంతో త్వ‌ర‌లోనే ఈ జంట విడిపోతుంద‌ని అంతా భావించ‌గా అనుకున్న‌ట్టుగానే జ‌రిగింది. ఇక ఇప్పుడు మ‌రి కొన్ని వార్త‌లు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లో సిరి ఆమెతో ఎంగేజ్మెంట్ జ‌రిగిన శ్రీహాన్ విడిపోతారని చ‌ర్చ జ‌రుగుతోంది. అంతే కాకుండా శ్రీహాన్ కూడా సిరికి బ్రేక‌ప్ చెప్ప‌డానికి రెడీగా ఉన్నాడ‌ట‌.

ఈ వార్త‌లు రావ‌డానికి కార‌ణం జ‌న‌వ‌రి 3న సిరి ప‌ట్టిన‌రోజు జ‌రిగింది. బర్త్ డే సంద‌ర్భంగా శ్రీహాన్ ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ను షేర్ చేశాడు. హ్యాపీ బ‌ర్త్ డే సిరి త్వ‌ర‌లోనే నీ ల‌క్ష్యాల‌ను చేరుకుంటావ్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. దాంతో శ్రీహాన్ కూడా బ్రేక‌ప్ చెప్పేస్తాడ‌ని టాక్ మ‌రోవైపు కాబోయే భార్య పుట్టిన రోజున ఎవరైన సెల‌బ్రేష‌న్స్ కు వెళ‌తారు. ఇక సోషల్ మీడియా స్టార్స్ కాబ‌ట్టి ఆ ఫోటోలను వీడియోల‌ను షేర్ చేస్తారు. ఇక్క‌డ అలా కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డ‌తో విడిపోవ‌డం ప‌క్కా అనే టాక్ వినిపిస్తుంది. మ‌రి ఈ జంట ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.

also read : ఈ ఫోటీలో ఒక చిరుతపులి దాక్కుని ఉంది దాన్ని కనిపెట్టగలరా ? తెలివైన వారికి మాత్రమే !

Visitors Are Also Reading