Home » శ్రీహాన్ తో సిరి పెళ్లి ఫిక్స్….ముహూర్తం ఎప్పుడంటే..?

శ్రీహాన్ తో సిరి పెళ్లి ఫిక్స్….ముహూర్తం ఎప్పుడంటే..?

by AJAY
Ad

సీరియ‌ల్స్ మ‌రియు షార్ట్స్ ఫిల్మ్ ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న న‌టి సిరి హ‌న్మంతు. ఆ త‌ర‌వాత సిరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లో గ్లామ‌ర్ మ‌రియు తెలివితో అభిమానుల‌ను సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్ లో సిరి ష‌ణ్ముక్ కు కాస్త క్లోజ్ ఉంది. ఇద్ద‌రూ హ‌గ్ లు ఇచ్చుకోవ‌డంతో బ‌య‌ట ఉన్న ష‌ణ్ముక్ గ‌ర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా అత‌డికి బ్రేకప్ చెప్పింది.

Advertisement

దాంతో సిరి పై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. సిరి వల్లనే షణ్ముక్ దీప్తి విడిపోయారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దాంతో సిరి తాను దీప్తి తో మాట్లాడినా ఫలితం లేదని చెప్పింది. మరోవైపు సిరి కి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. సిరి బాయ్ ఫ్రెండ్ కూడా షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

అంతే కాకుండా సిరి బిగ్ బాస్ లో ఉన్నపుడు శ్రీహాన్ ఫోన్ లో మాట్లాడటం…వచ్చి కలవడం తో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ లో అడుగుపెట్టి ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఆ సీజన్ లో టాప్ 2 లో నిలిచాడు. ఇదిలా ఉంటే సిరి శ్రేహాన్ సోషల్ మీడియా లో ఎక్కువ యాక్టిివ్ గా ఉంటారు. కాగా ఓ నెటిజన్ సిరిని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ అడిగాడు. దాంతో సిరి త్వరలోనే చేసుకుంటామని చెప్పింది.

Visitors Are Also Reading