Telugu News » Blog » Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Sir Movie : “సార్” మూవీ OTT డేట్ లాక్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

by Bunty
Ads

 

ధనుష్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బై లింగ్వల్ మూవీ చేశారు. తమిళంలో ‘వాతి’ టైటిల్ తో వస్తుంటే తెలుగులో ‘సార్’ పేరుతో విడుదలైంది. ట్రైలర్, టీజర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమ గత నెల ఫిబ్రవరి 17న మహాశివరాత్రి విడుదలై తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించింది. నిన్నటితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మూడు వారాల బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది.

Advertisement

READ ALSO: మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎంతలా మారిపోయిందో చూడండి!

 

గతేడాది రిలీజ్ అయిన ‘తిరు’ తమిళంలో రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, తెలుగులో రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే సార్ మూవీ మాత్రం రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసే ధనుష్ కు తెలుగులో ఊహించని విజయం దక్కింది. ఇందులో మరో విశేషమేంటంటే సార్ మూవీ తమిళ కలెక్షన్లతో పోలిస్తే తెలుగు కలెక్షన్ లే అధికంగా ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది.

Advertisement

READ ALSO : రాజయోగం కోసమే NTR రెండు పెళ్లిళ్లు చేసుకున్నారా… దీనికి కారణం అతనే !


కాగా మార్చి 17 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ తాజాగా ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార సంస్థ నిర్మించింది. ధనుష్ కు జోడిగా సంయుక్త మీనన్ నటించిన ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిస్తూ వెంకీ అట్లూరి ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు. సముద్రఖని ప్రతి నాయకుడు పాత్ర పోషించిన ఈ సినిమాకు జీ.వి.ప్రకాష్ కుమార్ స్వరాలు అందించాడు.

Advertisement

read also : David Warner : ఐపీఎల్‌లో మళ్లీ కెప్టెన్‌గా ఛాన్స్‌ కొట్టేసిన డేవిడ్‌ వార్నర్‌