Telugu News » Blog » SINGER SUNITHA : “ముసలి మొగుడు” అంటూ కామెంట్స్….స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్ సునిత….!

SINGER SUNITHA : “ముసలి మొగుడు” అంటూ కామెంట్స్….స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సింగర్ సునిత….!

by AJAY
Ads

సోషల్ మీడియాలో లో సెలిబ్రిటీలు తమకు వచ్చే కామెంట్లను పెద్దగా పట్టించుకోరు. అయితే కొన్నిసార్లు మాత్రం నెటిజన్లు చేసే కామెంట్లపై సెలబ్రిటీలు కౌంటర్లు ఇస్తుంటారు. నెటిజన్లు హద్దుమీరి ప్రవర్తించినప్పుడే సెలబ్రెటీ లు కూడా స్పందించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత కూడా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. సునీత ప్లే బ్యాక్ సింగర్ గా తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

singer sunitha images- Manamnews.com

singer sunitha images- Manamnews.com

 

 

ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడటంతో పాటు టీవీ షోలలో సింగర్ సునీత సందడి చేసేవారు. దాంతో సునీతకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక సునీత రియల్ లైఫ్ కి వస్తే చిన్న వయసులోనే వివాహం కాగా కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే సునీతకు ఒక కూతురు కుమారుడు కూడా ఉన్నారు. అనంతరం చాలా కాలం పాటు సింగిల్ గానే ఉండిపోయింది.

Sunitha marriage | FIRST PICS out! Singer Sunitha Upadrasta gets married to  Ram Veerapaneni

Also read : పుష్ప రికార్డు….50 రోజుల్లో 365 కోట్లు…!

సునీత ఏడాది క్రితం మాంగో మీడియా అధినేత రామ్ ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. లేటు వయసులో వివాహం చేసుకుంది అంటూ కొంతమంది సునీత రామ్ ల పై విమర్శలు కురిపించగా చాలామంది వీరి పెళ్లికి మద్దతు ప్రకటించారు. ఇక ప్రస్తుతం సునిత రామ్ అన్యోన్య జీవితాన్ని గడుపుతున్నారు. అయితే రీసెంట్ గా సునీత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలోని ఆలయానికి వెళ్లారు. అక్కడ రామానుజాచార్యుల విగ్రహం ముందు దిగిన ఫోటోను సునీత సోషల్ మీడియాలో షేర్ చేశారు.

singer sunitha comment to netizen - manamnews.com

singer sunitha comment to netizen – manamnews.com

 

దానికి ఓ వ్యక్తి “కాకిముక్కుకు దొండపండు… సునీతకు ముసలి మొగుడు.. అందం ఈమె సొంతం..ధనం ఆయన సొంతం.. గానం ఆవిడది… దర్జా అతనిది. అంటూ విమర్శిస్తూ కామెంట్ చేశాడు. దానికి సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నోటి దూల నీది…భారం భూమిది అంటూ కామెంట్ లో పేర్కొంది. కొంత మంది నెటిజన్లు సైతం ఈ ఫోటో పై నెగిటివ్ కామెంట్లు చేయగా సునీత ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ చాలా మంది సునిత కు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.


You may also like