ప్రముఖ సినీ, జానపథ గాయని మంగ్లీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆమె కళకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వం నుంచి ఉన్నత పదవీ వరించింది. తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మంగ్లీని నియమించారు ఏపీ సీఎం జగన్. రెండేళ్ల కాలం పాటు మంగ్లీ ఈ పదవీలో కొనసాగనున్నారు. ఇందుకోసం ఆమె నెలకు రూ.1లక్ష వేతనాన్ని ఏపి గవర్నమెంట్ నుంచి అందుకోనుంది.
Advertisement
గతంలో మంగ్లీ వైఎస్సార్సీపీ ప్రచారం చేసింది. జగన్ కి సంబంధించిన పలు పాటలను కూడా పాడింది. ఈ తరుణంలోనే ఆమె ఈ పదవీ దక్కినట్టు తెలుస్తోంది. ఎస్వీబీసీ సలహాదారునిగా నియమిస్తూ.. ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసినట్టు సమాచారం. ఇటీవలే బాధ్యతలను చేపట్టింది మంగ్లీ.
Advertisement
Also Read : షారుఖ్ ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్.. ఎన్ని లక్షలు ఖర్చు అయిందంటే ?
తెలంగాణ జానపథ గాయనిగా కింది స్థాయి నుంచి ఎదిగారు. ఒక న్యూస్ ఛానల్ లో తన కెరీర్ ప్రారంభించి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. స్టార్ గా మారింది. ప్రతీ పండుగకు ఆమె చేసే ప్రైవేట్ ఆల్బం కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురుచూసేవారు. అలా సినిమాల్లో కూడా పాడే అవకాశం రావడంతో.. తన టాలెంట్ ని నిరూపించుకుంటోంది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారంతో పాటు ఉత్తమ గాయనిగా ఎన్నో అవార్డులను అందుకుంది మంగ్లీ.
Also Read : రోజా కోరిక తీరింది.. దత్త పుత్రిక డాక్టర్ అయింది..!!