Telugu News » మంగ్లీని ప‌రిగెత్తించిన అభిమానులు… ఎందుకంటే..

మంగ్లీని ప‌రిగెత్తించిన అభిమానులు… ఎందుకంటే..

by Bunty

తెలంగాణ‌లో జాన‌ప‌ద పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న క‌ళాకారిణి మంగ్లీ. మంగ్లీ పాడిన జాన‌ప‌ద గేయాలు జ‌నాల్లోకి వెళ్ల‌డంతో ఆమెకు సినిమాల్లో పాటే అవ‌కాశం వ‌చ్చింది. అలా వ‌చ్చిన అవ‌కాశాన్ని మంగ్లీ స‌ద్వినియోగం చేసుకున్న‌ది. సినిమాల్లో సూప‌ర్ డూప‌ర్ హిట్స్ సాంగ్స్ పాడ‌టంతో ఆమెకు పాపులారిటీ పెరిగిపోయింది.

బ‌తుక‌మ్మ స‌మ‌యంలో మంగ్లీ పాట‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఫోక్ సాంగ్స్ కు అమె వాయిస్ స‌రిగ్గా స‌రిపోవ‌డంతో ప‌ల్లెజాన‌ప‌దాల‌తో కూడిన పాట‌ల‌ను ఆమెతోనే పాడించుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇటీవ‌లే పుష్ప క‌న్న‌డ వెర్ష‌న్ లో ఊ అంటావా మావ అనే పాట‌ను పాడింది. క‌న్న‌డ‌లో కూడా ఆ సాంగ్ మంచి హిట్ కావ‌డంతో మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంది. పాట‌లు మాత్ర‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు బుల్లితెర షోల‌లో, సినిమాల్లో కూడా నటిస్తూ మెప్పిస్తున్నది. అయితే, ఈ గాయ‌నికి అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌లే ఓ షూటింగ్‌కు అటెండ్ అయ్యేందుకు వెళ్లిన మంగ్లీని అభిమానులు చుట్టుముట్టారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ప్ర‌య‌త్నించారు. అభిమానుల సెల్ఫీల‌ను స‌హించ‌లేక‌పోయిన మంగ్లీ వెంట‌నే ఫోన్ లాక్కోవ‌డానికి ప్ర‌య‌త్నించింది. అభిమానులు ప‌రుగులు తీయ‌డంతో త‌న సిబ్బందిపై చేయి చేసుకొని వాళ్ల‌ను ప‌ట్టుకోవాల‌ని ఆదేశించింది. ఆ స‌మ‌యంలో పాపం మంగ్లీ ఏం చేస్తుందో తెలియ‌కుండా అటూ ఇటూ ప‌రుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Ads

You may also like