2022 ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఎదురుదెబ్బ తగిలింది. సహాయ కోచ్ సైమన్ కటిచ్ జట్టుకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. మెగా వేలం నిర్వహణకు ముందు అనుకున్న ప్రణాళికలను అమలు చేయడంలో ఫ్రాంచైజీ విస్మరించిందని, జట్టు నిర్వహణపై భిన్నాభిప్రాయాలు రావడంతో కటిచ్ నిర్ణయం తీసుకున్నట్టు ది ఆస్ట్రేలియన్ నివేదిక తెలియజేస్తుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 2019లో సైమన్ ప్రధాన కోచ్‌గా పని చేశాడు. కోచ్ లుగా పని చేసిన ట్రావెర్ బైలిస్, బ్రాడ్ హడిన్ వంటి మాజీలు కూడా గత సీజన్ నుంచి పదవుల నుంచి తప్పుకున్నాడు.
Also Read : బిల్ గేట్స్ కు ‘హిలాల్ ఎ పాకిస్తాన్’ అవార్డుతో సత్కారం
Advertisement
Advertisement
టామ్ మూడీని ఎస్ఆర్హెచ్ మరల ప్రధాన కోచ్‌గా నియమించుకున్నది. సైమన్ కటిచ్‌ను కూడా టామ్ మూడినే సహాయ కోచ్‌గా తీసుకొచ్చాడు. సైమన్ కూడా జట్టుకు దూరం కానున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్లో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, తుది జట్టులో స్థానం కల్పించకపోవడం వంటి చర్యలతో ఎస్ఆర్హెచ్ అప్రతిష్ట పాలు అయింది. మెగా వేలానికి ముందు వార్నర్‌ను కాదని.. ఎస్ఆర్హెచ్ కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమన్, ఉమ్రాన్ మాలిక్‌ను రిటెయిన్ చేసుకుంది. మరొకవైపు వేలంలో కూడా స్టార్ బ్యాట్స్మెన్లను దక్కించుకోవడంలో వెనుకడుగు వేసిందనే చెప్పవచ్చు.
ఎస్ఆర్హెచ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, భువనేశ్వర్‌కుమార్, నటరాజన్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, మార్ క్రమ్ మార్కో, జాన్సెన్, రొమారియో, షెపెర్డ్, సీన్ అబాట్, సామర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విష్ణు వినోద్, గ్లేన్ ఫిలిప్స్, ఫాజల్ హక్ ఫరూకి వంటి ఆటగాళ్లు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు.
Also Read : BANGARRAJU : బంగార్రాజులో ఉట్టికొట్టిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా….?