Home » Simhadri Movie: “సింహాద్రి” సినిమాకి కథ ఎలా వచ్చిందో తెలుసా ?

Simhadri Movie: “సింహాద్రి” సినిమాకి కథ ఎలా వచ్చిందో తెలుసా ?

by Sravanthi Pandrala Pandrala
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ నటుడిగా ఎదిగారు. అయితే ఈయనకు 21 ఏళ్ళ వయసులోనే సింహాద్రి సినిమా ఎంతో స్టార్ డమ్ ను తీసుకువచ్చింది. సింహాద్రి సినిమా చేశాక ఎన్టీఆర్ కి చాలా మంది అభిమానులు పెరిగారు. అయితే ఆ సినిమా తీశాక ఎంత పెద్ద హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ని సింహాద్రి రేంజ్ లోనే ప్రేక్షకులు ఊహించుకోవడం వల్ల ఎన్టీఆర్ కి అది కాస్త మైనస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే 20 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ హీరోలను పక్కన పెట్టి నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడ్డారు. రాజమౌళి రెండో సినిమా సింహాద్రి.

Also Read:   Popular Telugu Anchors: తెలుగులో మేల్ యాంకర్స్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా ?

Advertisement

simhadri

Advertisement

సింహాద్రి సినిమా జూలై 9, 2003 లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి తెర వెనక చాలా పెద్ద కథ నడిచింది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి కథను ఎప్పుడో రాసి పెట్టుకున్నారు. డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పెట్టి ఈ సినిమా తీయాలనుకున్నారట. కానీ అప్పటికే బాలకృష్ణ పల్నాటి బ్రహ్మ నాయుడు అనే సినిమాలో నటిస్తుండడం కారణంతో ఆ సినిమాకి నో చెప్పాడట. ఇక తర్వాత ఎన్టీఆర్ వద్దకు ఆ సినిమా రావడం అనేది చకచకా జరిగిపోయింది. అయితే ఈ కథ ఎలా పుట్టింది అనే విషయానికి వస్తే.. విజయేంద్ర ప్రసాద్ గారు తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల అనే సినిమా చూస్తున్నారట. ఆ సమయంలో సింహాద్రి సినిమా ఆలోచన ఆయన మనసులో మెదిలిందట.

అయితే వసంత కోకిల సినిమా లో శ్రీదేవి కమల్ హాసన్ ని చూసి గుండెల్లో గుచ్చేసి పోతుంది. అయితే అది చూసిన విజయేంద్రప్రసాద్ ఈ సీన్ ని మన సినిమాలో ఇంటర్వెల్ సీన్ గా పెట్టుకుందాం అని చెప్పేసి కథ రాయడం మొదలు పెట్టారట విజయప్రసాద్ గారు. అయితే వసంత కోకిల సినిమా లోనుంచి పుట్టిన ఆలోచనే సింహాద్రి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్ ని భూమిక గుండెల్లో గునపం తో గుచ్చేయడం. ఆ సీన్ చుట్టే కథ మొత్తం అల్లుకొని ఉంటుంది. అలా విడుదలైన ఎన్టీఆర్ సింహాద్రి సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. ఫ్రీ రిలీజ్ బిజినెస్ 11.4 కోట్లు జరగగా, కలెక్షన్లు 25 కోట్లకు పైగానే వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా బయ్యర్లకు 14 కోట్ల లాభాలు కూడా వచ్చాయి.

Also Read:  తెలంగాణ శకుంతల జీవితంలో ఇన్ని కష్టాలను ఎదుర్కొందా..? 

Visitors Are Also Reading