Home » ర‌జనీకాంతే ఢీలా ప‌డిపోయిన ఈ స‌మ‌యంలో…శింబు స‌క్సెస్ అవుతాడా? ట్రైల‌ర్ అయితే ఓకే!

ర‌జనీకాంతే ఢీలా ప‌డిపోయిన ఈ స‌మ‌యంలో…శింబు స‌క్సెస్ అవుతాడా? ట్రైల‌ర్ అయితే ఓకే!

by Azhar
Ad

శింబు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు. మన్మధ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని త‌న‌వైపుకు లాగాడు ఈ త‌మిళ తంబి. ఆ త‌రువాత ఈయ‌న‌ పెద్ద‌గా హిట్ అయిన‌ సినిమాల్లేవు. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన హీరోలు య‌శ్‌, విజ‌య్‌సేతుప‌తి కూడా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. అతి త‌క్కువ కాలంలోనే మంచి పేరు సాధించారు. కానీ వీళ్ళ‌కంటే ముందు వ‌చ్చిన‌ శింబుకి అంత మార్కెట్ లేద‌నే చెప్పాలి. మ‌న్మ‌థ‌ చిత్రంతో ఒక్క‌సారిగా స్టార్ అయిన శింబు స‌డెన్‌గా సైలెంట్ అయిపోయాడు. కొన్ని వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలు, ప్రేమ‌క‌లాపాల వ‌ల్ల శింబు త‌న కెరియ‌ర్‌ను చేతులారా పాడుచేసుకున్నారనే చెప్పాలి.

Advertisement

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (త‌లైవా) రోబో త‌ర్వాత స‌రైన హిట్ తెలుగులో లేదు. కాలా, ఇటీవ‌లె వ‌చ్చిన‌ పెద్ద‌న్న కూడా ఫ్లాప్ అయ్యాయి. ర‌జ‌నీకాంత్‌కే మార్కెట్ స‌రిగా లేని స‌మ‌యంలో శింబు లూప్ అనే చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. మ‌రి ఆయ‌న ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వ‌గ‌ల‌రా. ప్ర‌స్తుతం శింబుకి పెద్ద‌గా మార్కెట్ లేదు. మ‌రి ఈ టైమ్ లో ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా.. అనే ప్ర‌శ్న‌లు ఎన్నో వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. థ్రిల్ల‌ర్ కావ‌డంతో మంచి ఎమోష‌న్స్‌తో క‌ట్ అయిన ట్రైల‌ర్ చాలా మందే వీక్షిస్తున్నారు. ఇక సినిమా విష‌యం వ‌చ్చే స‌రికి ఎలా ఉంటుందో మ‌రి చూడాలి. ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్ రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. వెంకట్ ప్రభు లూప్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సౌత్ సినిమాలలో ఇప్పటి వరకు చూడనటువంటి కథతో ఈ సినిమా వస్తుంది. ట్రైలర్‌లో శింబు తన ట్రేడ్‌మార్క్ యాక్షన్ చూపించాడు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య విలన్‌గా నటించాడు..ఇందులో స్పైడ‌ర్ చిత్రంలోకంటే చాలా సైకోలా క‌నిపిస్తారు సూర్య. ఇక సూర్య యాక్ష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాలో అతడి పాత్ర భయంకరంగా ఉండబోతుంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది.

Watch Trailer : 

 

Visitors Are Also Reading