Home » ప్ర‌భాస్ పూజా హెగ్డే మ‌ధ్య సైలెంట్ వార్…ప్రూఫ్ ఇదే..!

ప్ర‌భాస్ పూజా హెగ్డే మ‌ధ్య సైలెంట్ వార్…ప్రూఫ్ ఇదే..!

by AJAY
Ad

సినిమా షూటింగ్ ల స‌మ‌యంలో న‌టీన‌టుల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు రావ‌డం స‌హ‌జ‌మే. కొన్ని సార్లు న‌టీన‌టుల మ‌ధ్య మ‌న‌స్పర్ద‌లు వ‌స్తే మీడియా ముందు వ‌చ్చి మ‌రీ పంచాయితీలు పెట్టుకుంటారు. కొంతమంది ఇన్ డైరెక్ట్ గా మాట‌లు అనుకుంటే కొంద‌రు మాత్రం సైలెంట్ గా ఉన్నా ఒక‌రిపై ఒక‌రు కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ లో జంట‌గా న‌టించిన ప్ర‌భాస్ పూజాహెగ్డే మ‌ధ్య కూడా సైలెంట్ వార్ న‌డుస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

radhe shyam

radhe shyam

నిజానికి రాధే శ్యామ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప్ర‌భాస్ పూజా హెగ్డే మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. అంతే కాకుండా మ‌న‌స్ప‌ర్ద‌లు ఉన్నా ఎవ‌రి షూటింగ్ పార్ట్ వాళ్లు పూర్తి చేసుకుని వెళ్లార‌ని కూడా వార్తలు వినిపించాయి. కానీ అలాంటిది ఏమీ లేద‌ని అవ‌న్నీ పుకార్ల‌ని చిత్రయూనిట్ కొట్టి పారేసింది. అయితే సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో పూజాహెగ్డే మ‌రియు ప్ర‌భాస్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు.

Advertisement

Advertisement

తాజాగా వీరిద్దరూ ముంబైలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. కానీ ఎడ‌ముఖం పెడ‌ముఖం పెట్టుకుని క‌నిపించారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు అంటూ వచ్చిన వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. ఇంట‌ర్వ్యూకు వ‌చ్చిన వెంట‌నే కేవ‌లం హాయ్ బాయ్ లు చెప్పుకున్నారు. ఏదో మీడియా బాధ‌కు మాత్రమే న‌వ్వుతున్న‌ట్టు క‌నిపించారు.

సాధార‌ణంగా హీరో హీరోయిన్ లు ఇంట‌ర్వ్యూకు వ‌స్తే సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంటారు. కానీ ప్ర‌భాస్ పూజా హెగ్డే మాత్రం పెద్ద‌గా మాట్లాడుకుంది లేదు. ఒక‌రిపై ఒక‌రు జోకులు వేసుకోలేదు. ప్ర‌భాస్ ఒక దిక్క చూస్తే పూజా హెగ్డే మ‌రోదిక్కు చూస్తున్న‌ట్టు క‌నిపించారు. అయితే ఇద్ద‌రి మ‌ధ్య ఇష్వ్యూ ఉందా లేదా అన్న‌ది తెలియాలంటే మాత్రం ఎవ‌రో ఒక‌రు నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading