Home » హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి ?

హనుమంతునికి ఎన్ని ప్రదక్షిణలు.. ఎలా చేయాలి ?

by Bunty
Ad

రాముడికి ఎంతో సాయం చేసిన అంజన్నకు చాలా మంది భక్తులు ఉన్నారు. కోరిన కోరికలు తీర్చే అంజన్న, భక్తులు, పూలు పత్రులతో పూజించగానే కొండంత అండై నిలుస్తాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ధైర్యాన్ని ఇస్తాడు. అందుకే ఆ ఆంజనేయ స్వామిని అత్యంత భక్తితో పూజిస్తారు. హనుమంతుడిని పూజించే విషయంలో కచ్చితంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. అన్ని దేవాలయాల్లో మూడు ప్రదక్షిణలు చేస్తుంటాం. కానీ ఆంజనేయస్వామి ఆలయంలో కచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలోనూ ‘శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’ అని చదవడం మంచిది.

Advertisement

రోజు ఒకే మారు 108 లేదా 54 అది చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. భక్తులకు ఏ బాధలు కలిగిన నియమాలు చెప్పి వారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామి ద్వారా తొలగిపోవునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధాన్యం శిలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి. పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకము ఇష్టం.

Advertisement

మంగళవార సేవ: మంగళవారం నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాలా ఇష్టం. అంతా కుదరని వారు మూతికైనా తప్పక పోయాలి. సింధురార్చన చేయడం, అరటిపండ్లు నివేదించడం చేయాలి.

శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించారు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాదికం చేయాలి. ఆ రోజున అప్పాలు, వడమాల వంటివి స్వామి వారికి నివేదించి స్వామి వారి ఆశీస్సులు పొందవచ్చు.

పంచ సంఖ్య: హనుమంతుడికి పంచ సంఖ్య ఇష్టం కాబట్టి చెస్వ ప్రదక్షిణాలు, నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు లేదా ఇతరములు, స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామి వారికి మరింత ప్రీతికరం.

READ ALSO : RRR నుంచి HIT 2 : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!

Visitors Are Also Reading