మరణం అనేది అంత ఈజీగా రాదు. నిజంగానే వస్తే ఎవరు ఆపలేరు. అయితే తన చితిని తానే పేర్చుకుని ఆత్మ** చేసుకున్నాడు. ఈ హృదయ విషాధకర ఘటన తెలంగాణ సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, సిద్దిపేట జిల్లా పొట్లపల్లికి చెందిన మేడ బోయిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఐదుగురికి పెళ్లిళ్లు చేశాడు. అయితే కొన్ని నెలల క్రితం వెంకటయ్య భార్య చనిపోయింది. ఐదు నెలల క్రితం వెంకటయ్య పోషణపై కుమారుల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నది.
READ ALSO : Silk Smitha : సిల్క్ స్మిత మళ్లీ పుట్టిందా… లేక ఆమె కూతురా…?
Advertisement
దీంతో తండ్రి వెంకటయ్యను ఎవరు పోషించాలన్న దానిపై పొట్లపల్లిలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరు చొప్పున నలుగురు కుమారులు వంతుల వారీగా తండ్రి వెంకటయ్యను పోషించాలని పెద్ద మనషులు నిర్ణయించారు. పొట్లపల్లి గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు వంతు పూర్తి కావడంతో నవాబుపేటలోని రెండో కుమారుడి వద్దకు వెంకటయ్య వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సొంతూరిని, ఇంటిని వదిలి వెళ్ళడం ఇష్టం లేని వెంకటయ్య మే 2వ తేదీ అదే గ్రామంలోని ఓ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. అదేరోజు రాత్రి ఆ నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు.
Advertisement
READ ALSO : “వయసు”తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్స్…!
మూడో తేదీన పొద్దున లేచిన వెంకటయ్య రెండో కుమారుడి దగ్గరకు వెళుతున్నానని చెప్పి పొట్లపల్లి నుంచి బయలుదేరాడు. కానీ సాయంత్రం వరకు కూడా ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అయితే మే 4వ తేదీ గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృ**దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృ**దేహం వృద్ధుడు వెంకటయ్యదే అని గుర్తించారు. తాటి కమ్మలను ఒకచోట కుప్పగా పేర్చుకొని వాటిని నిప్పంటించి అందులోకి దూకి ఆత్మ**త్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
READ ALSO : ‘కస్టడీ’ మూవీ ట్రైలర్ రిలీజ్… దుమ్ములేపిన నాగచైతన్య