Home » మూడోరోజు శ్యామ్ సింగ‌రాయ్ ప్లేస్ ఎంతో తెలుసా..?

మూడోరోజు శ్యామ్ సింగ‌రాయ్ ప్లేస్ ఎంతో తెలుసా..?

by Anji

బాక్సాఫీస్ వ‌ద్ద నాచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా మూవీ శ్యామ్ సింగ‌రాయ్ పై అంచనాలు అయితే పీక్స్‌లో ఉండేవి. కానీ ఆ అంచ‌నాల‌కు త‌గ్గ క‌లెక్ష‌న్‌ల‌ను సినిమా అందుకునే అవ‌కాశం లేకుండా చాలా త‌క్కువ‌గానే విడుదలను సొంతం చేసుకుంది. ఎలా పెర్పార్మ్ చేస్తుందో అన్న డౌట్ ఉన్నా.. కానీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్స‌లెంట్ క‌లెక్ష‌న్స్‌ని సొంతం చేసుకుంది.

 

అద‌ర‌గొట్టె క‌లోక్ష‌న్స్ వ‌సూలు చేసుకుంటూ దుమ్ము లేపుతూ దూసుకుపోతుంది. సినిమా ఇప్పుడు మొద‌టి వీకెండ్ ని పూర్తి చేసుకోగా మూడ‌వ రోజు ఉన్న అడ్డంకుల‌ను పోటీలో ఉన్న పుష్ప ని త‌ట్టుకుని త‌క్కువ థియేట‌ర్ల‌లో కూడా సాలిడ్ క‌లెక్ష‌న్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమా మూడ‌వ రోజు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద..

 

Shyam Singha Roy 1st Day Total Collections

3.52 షేర్‌ను అందుకుని దుమ్ములేపిన‌ప్ప‌టికీ కూడా టాలీవుడ్‌లో మీడియం రేంజ్ మూవీస్ ప‌రంగా చూసుకుంటే మూడవ‌రోజు నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరీ 5.19 కోట్ల షేర్‌తో టాప్‌లో ఉండ‌గా.. రామ్ న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ 4.32 కోట్ల షేర్‌తో టాప్‌లో నిలిచింది.

 

ఒక‌సారి మూడ‌వ రోజు టాలీవుడ్‌లో టైర్ 2 హీరోల ప‌రంగా హైయెస్ట్ క‌లెక్ష‌న్‌ను సొంతం చేసుకున్న సినిమాల‌ను ప‌రిశీలిస్తే.. ల‌వ్‌స్టోరీ 5.19 కోట్లు, ఇస్మార్ట్ శంక‌ర్ 4.32 కోట్లు, భీష్మ 4.31 కోట్లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ 4.03, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ 3.95 కోట్లు, మజిలి 3.91 కోట్లు, నిన్నుకోరి 3.85 కోట్లు, గ్యాంగ్‌లీడర్ 3.76 కోట్లు, నేను లోకల్‌ 3.7కోట్లు, శ్యామ్‌సింగ‌రాయ్ 3.52 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. మొత్తానికి టాప్ 10లో శ్యామ్‌సింగ‌రాయ్ స్థానం ద‌క్కించుకుంది.


You may also like