Home » Shyam Singha Roy: ఇంత బాగున్నా సీన్ ని ఎలా డిలీట్ చేసారు ?

Shyam Singha Roy: ఇంత బాగున్నా సీన్ ని ఎలా డిలీట్ చేసారు ?

by AJAY
Ad

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా శ్యామ్ సింగ‌రాయ్. ఈ సినిమా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. డిసెంబ‌ర్ 17న ఈ సినిమాను తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రంలో సాయిప‌ల్ల వి మ‌ర‌యు ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్లు గా న‌టించారు. రీసెంట్ గా ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

Advertisement

అయితే థియేట‌ర్ లోనూ మ‌రియు ఓటీటీలోనూ ఓ స‌న్నివేశాన్ని డిలీట్ చేశారు. కానీ ఆ సీన్ ను తాజాగా యూట్యూబ్ లో చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇక ప్ర‌స్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. సీన్ లో శ్యామ్ సింగ‌రాయ్ వేశ్య‌ల‌తో ఓ ఇంట్లో ఉండి వాళ్ల‌ను మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Advertisement

Shyam singharoy

Shyam singharoy

అయితే అదే ఇంటిలో ఉన్న ఓ &^& ఇన్ని చెబుతున్నావు క‌దా నన్ను పెళ్లి చేసుకుంటావా మ‌రి అంటూ శ్యామ్ సింగ‌రాయ్ ని ప్ర‌శ్నిస్తుంది. దానికి శ్యామ్ సింగ‌రాయ్ స‌మాధానమిస్తూ క‌చ్చితంగా చేసుకుంటాను కానీ నేను ప్రేమించినప్పుడు అంటూ స‌మాధానం ఇస్తాడు. అయితే ఈ సీన్ చాలా భాగుంద‌ని అనవ‌స‌రంగా డిలీట్ చేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సీన్ క‌ట్ చేయ‌కుండా ఉంటే సినిమాకే హైలెట్ గా నిలిచేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే థియేట‌ర్ లో కంటే సినిమాకు ఓటీటీలో మ‌రింత రెస్పాన్స్ వ‌స్తోంది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ బ్యాంగ్ అని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading