Home » బాలయ్య, చిరుల మధ్య 2001 సీన్ రిపీట్..! 

బాలయ్య, చిరుల మధ్య 2001 సీన్ రిపీట్..! 

by Azhar
Ad
టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న సీనియర్ హీరోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఉన్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు కూడా చాలా సార్లు సంక్రాంతి రేస్ లో పోటీ పడ్డారు అనేది తెల్సిందే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతిలో వీరు పోటీ పడబోతున్నారు. అయితే బాలయ్య తాజాగా నటిస్తున్న వీరసింహారెడ్డి అనే సినిమా 2023 సంక్రాంతికి విడుదల కాబోతున్నది.
ఇక అదే సంక్రాంతికి చేరు నటిస్తున్న వాల్తేరు వీరయ్య అనే సినిమా విడుదల కాబోతుంది. కానీ ఈ రెండు సినిమాలు 2001 సీన్ ను రిపీట్ చేస్తున్నాయి. అయితే 2001 సంక్రాంతికి రేస్ లో బాలయ్య నరసింహారెడ్డి సినిమా అలాగే చిరు మృగరాజు సినిమా అనేవి పోటీ పడ్డాయి. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ సిమ్రాన్ నే కావడం గమనార్హం.
అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న బాలయ్య వీరసింహారెడ్డి అలాగే చిరు వాల్తేరు వీరయ్య సినిమాల్లో కూడా ఒక్కే హీరోయిన్ కావడం గమనార్హం. ఆమె శృతి హాహాన్. 2001 తర్వాత కూడా బాలయ్య, చిరు సినిమాలు చాలాసార్లే సంక్రాంతి రేస్ లో ఉన్న కూడా ఇలా ఒక్కే హీరోయిన్ తో ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు అనేవి విడుదల కావడం అనేది మాత్రం మళ్ళీ ఇదే అని చెప్పాలి. ఇక చూడాలి మరి ఈ రెండు సినిమాలో ఏది హిట్ అవుతుంది అనేది.

Advertisement

Visitors Are Also Reading