Home » సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్!

సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్!

by Bunty
Ad

హీరోయిన్ శ్రియ.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. అప్ప‌ట్లో టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను.. ఓ ఊపు ఊపేసింది శ్రియ‌. అయితే.. ఇప్పుడు పెద్ద‌ సినిమాల్లో ఛాన్స్ లు రాక‌పోవ‌డంతో.. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పోతుంది ఈ అమ్మడు. అయితే.. తాజాగా శ్రియ‌.. గ‌మ‌నం అనే సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ సినిమా శుక్ర వారం.. విడుద‌ల అయింది. ఈనేప‌థ్యంలోనే.. శ్రియా.. కూక‌ట్ ప‌ల్లి మ‌ళ్లి ఖార్జున థియేట‌ర్ లో సంద‌డి చేసింది.

Advertisement

Advertisement

కాగా.. థియేట‌ర్ కు శ్రియా ఆటోలో రావ‌డంతో.. అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణ ఏర్ప‌డింది. కూక‌ట్ ప‌ల్లి.. ద‌గ్గ‌ర నిజాంపేట్… క్రాస్ రోడ్ వ‌ద్ద ఉన్న మ‌ళ్లి ఖార్జున థియేట‌ర్ కు ఆమె రావ‌డంతో… ఫ్యాన్స్ సెల్పీల కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే.. శ్రియా… ఆటోలో… వ‌చ్చిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

sriya

కాగా.. గ‌మ‌నం సిన‌మాను సుజ‌నారావు… డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాను.. ర‌మేష్ క‌రుటూరి నిర్మించారు. సామాజికంగా.. వెనుక‌బ‌డిన ముగ్గురు యువ‌తుల జీవితాల చుట్టూ.. తిరిగే క‌థాంశంతో.. ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇక ఈ సినిమా పై టాక్ కూడా బాగానే వ‌చ్చింది.

Visitors Are Also Reading