Home » కుటుంబ స‌భ్యులు మ‌ర‌ణిస్తే ఏడాది వ‌ర‌కు పండ‌గ‌లు ఎందుకు చెయ్యకూడదో తెలుసా ?

కుటుంబ స‌భ్యులు మ‌ర‌ణిస్తే ఏడాది వ‌ర‌కు పండ‌గ‌లు ఎందుకు చెయ్యకూడదో తెలుసా ?

by Bunty
Ad

మ‌న రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల‌లో ఒక ఆచారం ఉంటుంది. ఒక కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రైన ఒక‌రూ చ‌నిపోతే ఆ ఇంట్లో ఏడాది పాటు గా ఎలాంటి పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌ప‌రు. అంతే కాకుండా దేవాల‌యాలకు కూడా వెళ్లరు. అలాగే ఆ ఇంట్లో క‌నీసం దేవునికి దీపం కూడా పెట్ట‌రు. అంతే కాకుండా మ‌రి కొంత మంది ఆ ఇంట్లో ఉన్న దేవ‌తల ఫోటో ల‌ను తీసి ఒక మూట క‌ట్టి.. దాన్ని క‌నిపించ‌కుండా దాచేస్తారు. ఆ ఏడాది పాటు వాటిని క‌నీసం తాక‌రు. అయితే ఒక కుటుంబ స‌భ్యు ల‌లో ఎవ‌రైన చ‌నిపోతే.. ఆ కుటుంబం అంతా.. ఇలా త‌ప్ప‌క చేయాలా అనే సందేహం చాలా మందికి వ‌స్తుంది. ఇప్పుడు దాని గురించి మ‌నం పూర్తి గా తెలుసు కుందాం.

Also Read: 2000 పెట్టి కొన్న డ్రాయింగ్…. ఇప్పుడు కోట్లు ప‌లుకుతుంది!

Advertisement

Advertisement

నిజానికి మ‌న హిందూ సంప్రాదాయం ప్ర‌కారం ఒక కుటుంబంలో ఎవ‌రైన‌ర ఒక‌రు మ‌ర‌ణిస్తే ఇలా ఏడాది పాటు దైవ ఆరాధ‌న కు దూరం గా ఉండాల‌ని.. ఎక్కుడ కూడా రాసి లేదు. మ‌న హిందూ సంప్రాదాయం ప్ర‌కారం కుటుంబం లో ఎవ‌రైన చ‌నిపోతే.. అప్ప‌టి నుంచి 11 వ రోజు వ‌ర‌కు ఎలాంటి పూజా కార్యక్ర‌మాలు నిర్వ‌హించ కుడ‌దు. 11 వ రోజు ఆ కుటుంబం లో శుద్ధి కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. ఈ శుద్ధి కార్య‌క్ర‌మం అనంత‌రం 12 వ రోజు నుంచి శుభ స్వీకారం జ‌రుగుతుంది. అయితే 11 వ రోజు నిర్వ‌హించే శుభ కార్య‌క్ర‌మం ముందు రోజుల‌లో ఎలాంటి పూజాలు చేయ‌కుడ‌దు. అలాగే దేవ‌త ఫోటో ల‌ను త‌క కూడ‌దు. 12 వ రోజు నుంచి య‌ధావిధి గా పూజలు చేయ‌వ‌చ్చు. అలాగే దేవాలాయాల కు వెళ్ల‌వ‌చ్చు.

నిజానికి మ‌న ఇంట్లో దేవ‌తల ఫోటో ల‌కు నిత్యం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల .. ఆ ఫోటో ల‌ల్లో దేవ‌తలు వ‌చ్చి కూర్చుంటారు. మ‌నం చేసే ప్ర‌తి పూజా వారికి నేరుగా చేరుతుంది. కానీ మ‌నం ఏడాది పాటు దేవ‌తల ఫోటో ల వైపు చూడ‌కుండా ఉంటే.. వాటి కి పూజలు చేయ‌కుండా ఉంటే దేవ‌తలు ఆ ఫోటో ల నుంచి వెళ్లి పోతారు. ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు చాలా కీడు జ‌రుగుతుంది. ఇంట్లో ఉన్న దేవ‌ళ్ల పోటో ల కు నిత్యం పూజాలు నిర్వ‌హించాలి.

Also Read: హీరోల‌కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటున్న విల‌న్లు..ఎంత తీసుకుంటారో తెలుసా..?

Visitors Are Also Reading