Home » ఈ ఇద్ద‌రు న‌టుల మ‌ధ్య‌ జ‌రిగిన సంఘ‌ట‌న‌! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దన‌డానికి మంచి ఉదాహ‌ర‌ణ‌!!

ఈ ఇద్ద‌రు న‌టుల మ‌ధ్య‌ జ‌రిగిన సంఘ‌ట‌న‌! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దన‌డానికి మంచి ఉదాహ‌ర‌ణ‌!!

by Azhar
Ad

హీరోల‌తో స‌మానంగా పారితోషికం తీసుకుంటున్న స్టార్ విల‌న్ రాజ‌నాల‌కు అప్పుడే సినిమాలో ఓ చిన్న వేషం ద‌క్కించుకున్న శోభ‌న్ బాబుల‌కు మ‌ద్య సీన్! ఈ షూట్ త‌ర్వాత రాజ‌నాల‌కు మ‌రో సినిమా షూట్ ఉంది. రాజ‌నాల‌ను చూసి హ‌డ‌లిపోయిన‌ శోభ‌న్ బాబు బాబు టేకుల మీద టేకులు తీసుకుంటున్నాడు. విసుగుచెందిన రాజ‌నాల “ఎవ‌ర‌య్యా నువ్వు? యాక్టింగ్ రాదు, ఏమీ రాదు, ఎందుకొస్తారో?” అని నేను ఈ సీన్ చేయ‌న‌ని వెళ్లిపోయాడట‌. మ‌రుస‌టి రోజు శోభ‌న్ బాబు పాత్ర‌లో ఇంకో న‌టుడిని పెట్టి, శోభ‌న్ బాబు కు మ‌రో వేషం ఇచ్చారు.

Advertisement

క‌ట్ చేస్తే…… శోభ‌న్ బాబు అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగాడు, స్టార్ విల‌న్ గా ఉన్న రాజ‌నాల చెడు వ్య‌స‌నాల‌కు అల‌వాటు ప‌డి ఆర్థికంగా న‌ష్టాల్లో కూరుకుపోయారు. దీనికి తోడు భార్య మరణం,కొడుకు నిర్ల‌క్ష్యంతో 1980 నాటికి రాజ‌నాల స‌ర్వం కోల్పోయాడు.

Advertisement

ఒక‌రోజు….రోడ్ పై వెళ్తున్న రాజనాలను చూసిన శోభ‌న్ బాబు త‌న కార్ ఆపి, ఎక్కించుకొని ఇంటి దగ్గర దిగబెట్టాడు.ఆ తరువాత జేబులోంచి ఓ కవర్ తీసి రాజనాలకు ఇచ్చాడు.ఇది “నేను వెళ్ళాక ఓపెన్ చేయ”మని చెప్పాడు.రాజనాల “ఏంటి ఇద‌”ని అడగగా…దానికి అయన “గురువుకి ఎదో ఇచ్చి ఋణం తీర్చుకోవాలి కదా” అన్నార‌ట‌! ఆ కవర్ లో 25,000/- ఉన్నాయ‌ట‌! అది చూసి రాజనాల కన్నీళ్ళు పెట్టుకున్నార‌ట‌. రాజనాల తన చివరి రోజుల్లో జ్యోతిష్యం చెప్పుకుంటూ కొన్నాళ్లు ఆయన జీవించారట‌. ఆఖరికి 1998 మే 21 తేదిన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి అక్కడే తుదిశ్వాస విడిచారు.

Visitors Are Also Reading