Home » ఇండస్ట్రీలో క్యాంపులు ఎక్కువ అంటున్న శివాజీ రాజా..!

ఇండస్ట్రీలో క్యాంపులు ఎక్కువ అంటున్న శివాజీ రాజా..!

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉంటాయి అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోతే వారికీ అవకాశాలు రావడం అనేది.. అలాగే హీరోగా నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం అంటూ చాలా మంది ఓపెన్ గానే చెప్పేసారు అనేది తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న మరో కొత్త సమస్య గురించి ప్రముఖ నటుడు శివాజీ రాజా తెలిపారు.

Advertisement

అయితే శివాజీ రాజాకు చిరంజీవి అంటే చాలా ఇషటం అనేది అందరికి తెలిసిందే. అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇచ్చిన.. ఎక్కడ మాట్లాడిన తప్పకుండ చిరంజీవి గురించి మాట్లాడుతుంటాడు శివాజీ రాజా. ఇక ఈ మధ్యే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చిరంజీవి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను చిరంజీవి అభిమాని అవ్వడం తనకు ప్లేస్ అయ్యిందో లేక మైనస్ అయ్యిందో అనేది తనకు అర్ధం కావడం లేదు అని అన్నాడు.

Advertisement

ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లిన చిరంజీవి గురించి నేను మాట్లాడేవాడిని. అందుకే నేను ఆయన క్యాంపుకు చెందిన వాడిని అని మిగితా వారు నన్ను పట్టించుకోలేదు. అలాగే తమ క్యాంపుకు చెందినవాడిని కదా అని వీరు కూడా నన్ను పట్టించుకోలేదు. అవకాశాలు ఇవ్వలేదు అని శివాజీ రాజా తెలిపాడు. అందుకే ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలు ఎవరు తమ అభిమాన హీరో గురించి మాట్లాడవద్దు అని శివాజీ రాజా సూచించాడు. అలా చెయ్యడం వల్ల వారు ఇబ్బందులో పడుతారు అని.. తాను ఇది స్వయంగా అనుభవం మీద తెలుసుకున్నాను అని ఆయన శివాజీ రాజా పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

రాహుల్ తెవాటియా విషయంలో బీసీసీఐ తప్పు చేస్తుందా…?

భారత ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన బీసీసీఐ..!

Visitors Are Also Reading