Madhumitha Siva Balaji wife: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కానీ కలిసి ఉన్నవాళ్లు మాత్రం చాలా తక్కువ మందే అని చెప్పాలి. అలా కలిసి ఉంటున్న జంటల్లో శివబాలాజీ మధుమిత కూడా ఉన్నారు. శివబాలాజీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత చాలా సినిమాల్లో నటించాడు. ఆర్య సినిమాలో అజయ్ అనే పాత్రలో నటించి ఎక్కువ ఫేమస్ అయ్యాడు.
Advertisement
Madhumitha Siva Balaji wife, Family Photos, Movies
ఇక ప్రస్తుతం శివబాలాజీ సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే శివబాలాజీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. హీరోయిన్ మధుమితను శివబాలాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా తాజాగా వీరిద్దరూ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆసక్తికర కామెంట్ లు చేశారు. మధుమితతో ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో కలిసి నటించినట్టు తెలిపాడు.
Advertisement
ఆ సినిమా సమయంలో శివబాలాజీ తనను ఫ్లర్ట్ చేయాలని చూశాడని మధుమిత చెప్పుకొచ్చింది. తనతో మాట్లాడటానికి ఎంతో ట్రై చేసేవాడని చెప్పింది. అంతే కాకుండా ఆ సినిమా షూటింగ్ లో భాగంగా లేచిపోయే సీన్ లో శివబాలాజీ తనను కిస్ చేశాడని చెప్పింది. అలా తాము ప్రేమలో పడ్డామని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది. ఇక శివబాలాజీ బిగ్ బాస్ లో ఉన్నసమయంలో ఏడ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి వరకూ అన్ని రోజులు శివబాలాజీతో మాట్లాడకుండా ఎప్పుడూ లేనని ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
ALSO READ : Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?