Home » Shiva Vedha Movie Review : శివ రాజ్ కుమార్ ‘శివ వేద’ ఎలా ఉందంటే..?

Shiva Vedha Movie Review : శివ రాజ్ కుమార్ ‘శివ వేద’ ఎలా ఉందంటే..?

by Anji
Ad

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన 125వ చిత్రం శివ వేద. కన్నడంలో డిసెంబర్ 23, 2022న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలలో నిర్మాత ఎంవీఆర్ కృష్ణ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

నటీనటులు :

శివరాజ్ కుమార్, గానని లక్ష్మణ్, భరత్ సాగర్, శ్వేత చంగప్ప, ఉమా శ్రీ, అదితి సాగర్, వీణ పొన్నప్ప తదితరులు. 

ఛాయాగ్రహణం : స్వామి జె.గౌడ 

సంగీతం : అర్జున్ జన్యా 

నిర్మాత : గీత శివరాజ్ కుమార్, జీ స్టూడియోస్ 

రచన, దర్శకత్వం : హర్ష 

తెలుగులో విడుదల : ఎంవీఆర్ కృష్ణ 

కథ :

ఒక గ్రామంలో ఉండే  వేద (శివ రాజ్ కుమార్) కుమార్తె కనక (అదితి సాగర్) వీరిద్దరూ కలిసి చంద్రగిరిలో పోలీస్ అధికారి రుద్ర (భరత్ సాగర్ )ని చంపేస్తారు.  వీరే చంపేశారని మరో మహిళా పోలీస్ అధికారిని రమ(వీణ పొన్నప్ప)కి తెలుసు. రుద్రతో పాటు మరో నలుగురిని కూడా Ha త్య చేస్తారు. అసలు ఈ తండ్రీ, కూతురు కలిసి మారణకాండ ఎందుకు సాగించారు..? వీరి గతం ఏంటి..? జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ : 

Shiva Vedha | Telugu Movie News - Times of India

 

యాక్షన్ వెనుక ఎమోషన్ ఎంత బలంగా ఉంటే ఫైట్ చేసేటప్పుడు థియేటర్లలో ప్రేక్షకులకు అంత హై వస్తుంది. హీరో ఫైట్ చేసినా..హీరోయిన్ ఫైట్ చేసినా అందులో మాత్రం మార్పుండదు. ఆ విషయాన్ని శివ వేద చిత్రం స్పష్టంగా చెబుతుంది.  ఈ చిత్రం కథ అంతా 1965-1985 నేపథ్యంలో ఉంటుంది. ఈ కాలంలో మహిళలు ఎదుర్కొన్నటువంటి ఓ సమస్యను బలంగా చూపించారు. అమ్మాయిలు ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ధైర్యంగా ఉండాలని.. భయపడకూడదనే సందేశం ఇచ్చారు. ఈ సినిమా పరిచయం బాగుంది. ఎందుకు చంపుతున్నారనే ఆసక్తి కూడా ఉంటుంది. 

Advertisement

Manam News

 

ఇక మధ్య మధ్యలో వచ్చే హీరో, హీరోయిన్ ట్రాక్ కొంచెం బోర్ కొడుతుంది. దీనికి తోడు కామెడీ మనకు కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇంటర్వెల్ ముందు ఫైట్, క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించాయి. మధ్యలో గానవి లక్ష్మణ్ చేసే ఫైట్ కూడా అదుర్స్ అనే చెప్పాలి. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూసినా.. సినిమా చూసినా కేజీఎఫ్ చిత్రం ప్రభావం బలంగానే కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి, కలర్ గ్రేడింగ్, లైటింగ్ విషయంలో కేజీఎఫ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. శివరాజ్ కుమార్ ని స్వామి జె.గౌడ సరికొత్తగా చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లో అయితే స్లో మోషన్ షాట్స్ బాగున్నాయి. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. సంగీతంలో కూడా కేజీఎఫ్ ఛాయలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలివేషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. అర్జున్ జన్యా రీ రికార్డింగ్ వల్ల కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యాయి. నేపథ్య సంగీతంలో ఉపయోగించినటువంటి పాటలు చాలా బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 

Also Read :  అమిగోస్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ? 

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • యాక్షన్ సీన్స్ 
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
  • సినిమాటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్ :

  • సాగదీసినట్టు ఉండే కొన్ని సీన్లు
  • పాటలు 
  • తెలిసిన కథ 

రేటింగ్ : 2.75 / 5

Also Read :  వెంక‌టేష్ రాజేంద్ర‌ప్ర‌సాద్ ల మ‌ధ్య గ్యాప్ ఎందుకు వ‌చ్చింది..? ఆ గొడ‌వ‌ల‌కు కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading