Telugu News » Blog » మరో యువ దర్శకునితో వెంకటేష్..!

మరో యువ దర్శకునితో వెంకటేష్..!

by Manohar Reddy Mano
Ads

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు అనేవి చేస్తూ వెళ్తున్నాడు. అయితే ఈ మధ్యే ఎఫ్ 3తో అభిమానుల ముందుకు వచ్చిన వెంకటేష్ తాను తర్వాత చేయబోయే సినిమాల పైన అంతగా క్లారిటీ ఏది ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అయితే ఈ మధ్యే వెంకటేష్ ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

అదే క్రమంలో తరుణ్ భాస్కర్ తో వెంకటేష్ సినిమా తీయబోతున్నట్లు ఎప్పటినుండో ప్రచారం అనేది జరుగుతున్న.. ఇప్పుడు మరో యువ దర్శకునిగా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే నాని హీరోగా నిన్ను కోరి సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా మరిచయం అయిన శివ నిర్వాణ ఆ తర్వాత మజిలీ సినిమాతో హిట్ కొట్టాడు. కానీ ఈ మధ్య ఆయన చేసిన టక్ జగదీష్ సినిమా తీసి మొదటి ప్లాప్ ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement

 

అయితే ఇప్పుడు ఆయన విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో వెంకటేష్ కోసం ఓ కథను సిద్ధ చేసుకున్న శివ తాజాగా దానినికి వెంకీకి వినిపించినట్లు తెలుస్తుంది. ఇక ఈ కథ అనేది బాగా నచ్చడంతో వెంకటేష్ కూడా వెంటనే ఆ కథను గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చాడట. దీనిపై అధికారిక న్యూస్ రావటమే ఆలస్యమట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మించనున్నట్లు కూడా తెలుస్తుంది.

Advertisement

ఇవి కూడా చదవండి :

పాక్ అభిమానుల కల నెరవేర్చిన విరాట్..!

కోహ్లీ ఫామ్ పై షాహిన్ కామెంట్స్..!