పాపులర్ టీవీ పర్సనాలిటీ మరియు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ శివ జ్యోతి తాను గర్భవతి అని వస్తున్న వార్తలను ఖండించారు. ఈ విషయాన్ని ఆమె తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్వయంగా తెలిపింది. అందులో “మీకో దండం రా బాబూ…నేను గర్భవతిని కాదు” ఆమె చెప్పింది. తాజాగా ఆమె పచ్చి మామిడి పండ్లను తినడం అభిమానులు గమనించినప్పటి నుండి ఈ ప్రెగ్నెన్సీ పుకార్లు మొదలయ్యాయి.
Advertisement
అయితే ‘తీన్మార్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శివ జ్యోతి. ఆమె స్క్రీన్ పేరు సావిత్రిగానే చాలా మందికి తెలుసు. ఈ షో తో వచ్చిన గుర్తింపు ద్వారా బిగ్ బాస్ లో అడుగు పెట్టిన శివ జ్యోతి.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇదే తరహా షోను హోస్ట్ చేసేందుకు మరో ఛానెల్ కు షిఫ్ట్ అయింది.
Advertisement
అయితే, బిగ్ షోలో కంటెస్టెంట్గా చేరిన తర్వాత ఆమెకు వచ్చిన మరింత ఫెమ్ తో స్టార్ అయిపోయింది. తాను మరియు తన భర్త గంగూలీ కలిసి కొన్ని టీవీ షోలలో కూడా కనిపించారు. అయితే ప్రస్తుతం తాను గర్భవతి కాదని… ప్రెగ్నెన్సీ గురించి పుకార్లు వ్యాప్తి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే గర్భవతి కావడం అనేది తన జీవితంలో ఒక భావోద్వేగ సమస్య… దానిని తేలికగా తీసుకోలేము అని ఆవిడ తెలిపింది.
ఇవి కూడా చదవండి :
ఉమ్రాన్ పై కేటీఆర్ ప్రశంసలు..!
రొనాల్డో ఇంట్లో తీవ్ర విషాదం..!