టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో స్టార్ బ్యాట్స్మెన్ గా మొన్నటి వరకు కొనసాగిన శిఖర్ ధావన్… ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఛాన్స్ వస్తే మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు శిఖర్ ధావన్. అంతేకాదు ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కోసం కూడా సంసిద్ధమవుతున్నాడు ఈ గబ్బర్.
పంజాబ్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్… ఈసారి ఆ జట్టును ఛాంపియన్గా నిలిపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ఇలా ఉండగా తాజాగా టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. క్రికెటర్ శిఖర్ ధావన్ తన కుమారుడు జోరావర్ బర్త్డే సందర్భంగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. నేను నిన్ను చూసి ఏడాది అయిపోయింది అంటూ రాసుకొచ్చారు ధావన్. మూడు నెలలుగా ఫోన్ సంభాషణ కూడా లేదు… నీ తాజా ఫోటో కూడా లేనందున గతంలో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ తో….. విషెస్ చెబుతున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు శిఖర్ ధావన్.
Advertisement
దేవుడి దయతో మనం మళ్లీ కలిసే రోజు వస్తుందని ఆశిస్తున్న అంటూ రాసుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా తాము విడిపోతున్నట్లు రెండు సంవత్సరాల కిందట శిఖర్ ధావన్ మరియు ఆయేషా ముఖర్జీ దంపతులు ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ… ఢిల్లీలోని ఫ్యామిలీ కోట్ లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు శిఖర్ ధావన్. దీంతో వీరిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.