ఐపీఎల్ 2022 లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న శిఖర్ ధావన్ ఒక్కే మ్యాచ్ లో మూడు రికార్డ్స్ సాధించాడు. అయితే నేడు పంజాన్ కింగ్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చాడు పంజాబ్ ఓపెనర్లు మయాంక్ మరియు ధావన్. అయితే ఐపీఎల్ లో ధావన్ కు మొత్తంగా ఇది 200వ మ్యాచ్. ఎంఎస్ ధోని 227, దినేష్ కార్తీక్ 221, రోహిత్ శర్మ 220, విరాట్ కోహ్లీ 215, జడేజా 207, రైనా 205, రాబిన్ ఉతప్ప 200 తర్వాత..ఈ రికార్డు సాధించిన 8వ ఆటగాడిగా గబ్బర్ నిలిచాడు.
Advertisement
అయితే ఈ మ్యాచ్ కు ముందువరకు ఐపీఎల్ లో 5998 పరుగులు చేసినా గబ్బర్… ఇందులో అర్ధశతకం సాధించి ఐపీఎల్ లో 6000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఈ జాబితాలో 6402 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపైన అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా హబ్బర్ రికార్డు క్రియేట్ చేసాడు.
Advertisement
ఇప్పటివరకు 949 పరుగులతో కోహ్లీ పేరిట ఈ రికార్డు ఉండగా.. ఈ మ్యాచ్ కు ముందు దానికి 9 పరుగుల దూరంలో ఉన్న గబ్బర్ ఇప్పుడు దానిని కూడా చేధించాడు . ఇదే క్రమంలో తన అర్ధశతకంతో చెన్నైపై 1000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్ లో 9000 పరుగులు చేసిన మూడో భారతీయుడిగా నిలిచాడు. ఇంతకముందు కోహ్లీ, రోహిత్ ఈ మైలురాయిని అందుకోగా… మ్యాచ్ కు ముందు 11 పరుగుల దూరంలో ఉన్న గబ్బర్ ఆ రికార్డు ను సొంతం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
రిటైర్మెంట్ తర్వాత మరో రంగంలోకి వెళ్లిన 5 క్రికెటర్లు వీరే…!
ఆరెంజ్ క్యాప్ పోటీ ఆ ఇద్దరికే..?