ఒకప్పుడు టాప్ టెన్ స్టార్ హీరోల్లో హీరో రాజశేఖర్ ఒకరు. ఆయన తన సినిమాలతో ఎంతోమంది అభిమానుల సంపాదించుకొని చివరికి ఇండస్ట్రీలో అనేక ఇబ్బందులు పడ్డారు. చాలా లాస్ అయ్యారు. చివరికి శేఖర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాను హిట్ చేయండి. నిలబెట్టండి అంటూ ప్రాధేయ పడ్డాడు. సినిమా పోతే కనీసం అమ్ముకోవడానికి ఆస్తులు కూడా లేవని దీనంగా అన్నారు రాజశేఖర్. దీన్ని బట్టి చూస్తే ” శేఖర్” సినిమాపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
ఈ మూవీ పైన తన కుటుంబం కూడా ఆధారపడి ఉందనేది అర్థం చేసుకోవచ్చు. జోసెఫ్ మూవీ కి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ ఇంత సాదా సీదాగా తీసిన హిట్టవుతుందని ఒక భరోసా రాజశేఖర్ కు ఉండేది. ఎందుకంటే జోసెఫ్ బంపర్ హిట్ అయింది కాబట్టి. దీనికి తోడు గా రాజశేఖర్ కెరీర్ లో రీమేకులు చాలా కలిసి వచ్చాయి.. దీంతో శేఖర్ మూవీని చాలా నమ్మారు. పెట్టుబడులు కూడా పెట్టారు. మొదటి రోజు ఓకే అనే టాక్ వచ్చింది. ఈ తరుణంలోనే కోర్టు కేసులు ఈ సినిమాని నిలిపివేశాయి. దీంతో శేఖర్ పై సినిమాల భారం దారుణంగా పడింది.
Advertisement
65 లక్షల రూపాయల డిపాజిట్ చెల్లించలేదని సినిమాను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వీకెండ్ లో ఈ మూవీ లేకపోవడం “శేఖర్” ని కిల్ చేసినట్టవుతుంది. ఇప్పటికిప్పుడు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ ను తెచ్చుకునే సమయం లేదు.. ఇక సోమవారం నుంచి థియేటర్లలో ఉన్న పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. వచ్చేవారం “f3 “మూవీ రిలీజ్. ఈ మూవీ వస్తే మాత్రం శేఖర్ ను పట్టించుకునే వారైతే ఉండరు. అయితే ఈ సినిమాను ఓటిటికి ఇవ్వమని ముందే ఆఫర్లు వచ్చినా ఆయన ఇవ్వలేదు. కనీసం అప్పుడు అమ్ముకున్న రాజశేఖర్ గట్టెక్కే వాడు. ఇప్పుడు అది పోయింది ఇది పోయింది. దీంతో ఫలితం లేకుండా పోయిందని ఈ సినిమాతో రాజశేఖర్ పూర్తిగా మునిగినట్టే అని చాలా మంది అనుకుంటున్నారు.
ALSO READ;
సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..
అందంగా ఉన్నా కానీ పట్టించుకోవడం లేదట.. కారణం తెలుగమ్మాయి కావడమేనా..!!