Home » షారుక్ ల‌తాజీ పాదాల వ‌ద్ద ఉమ్మేశాడా..? అస‌లేం జ‌రిగింది..!

షారుక్ ల‌తాజీ పాదాల వ‌ద్ద ఉమ్మేశాడా..? అస‌లేం జ‌రిగింది..!

by AJAY
Ad

నైటింగెల్ ఆఫ్ ఇండియా ల‌తా మంగేష్క‌ర్ ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన క‌న్నుమూశారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని ఎంతో మంది లెజెండ్స్ ను పొట్ట‌న పెట్టుకున్న క‌రోనా మ‌హ‌మ్మారి ల‌తా మంగేష్క‌ర్ ను సైతం లేకుండా చేసింది. కొద్దిరోజుల పాటూ క‌రోనాతో పోరాడిన లెజెండ‌రీ సింగర్ మ‌హ‌మ్మారిని జ‌యించ‌లేక‌పోయింది. దాంతో ఆమె అభిమానులు, సెల‌బ్రెటీలు సోష‌ల్ మీడియాద్వారా సంతాపం తెలిపారు.

Advertisement

ఇక నిన్న ప‌లువురు ప్ర‌ముఖులు ల‌తామంగేష్క‌ర్ భౌతిక కాయాన్ని సంద‌ర్శించి నివాళులు అర్పించారు. ప్ర‌ధాని మోడీ స‌హాప‌లువురు రాజ‌కీయ సినీ ప్ర‌ముఖులు నివాళులు అర్పించ‌గా బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కూడా ల‌తా మంగేష్క‌ర్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

Advertisement

ALSO READ : అంగరంగ వైభవంగా సింగర్ రేవంత్ పెళ్లి..ఫోటోలు వైరల్..!

sharukh khan family

sharukh khan family

ఈ సంధ‌ర్బంగా షారుక్ ఖాన్ ల‌తా మంగేష్క‌ర్ పాదాల వ‌ద్ద ప్రార్థ‌న చేసి ఊదారు. అలా ప్రార్థ‌న చేసి ఊద‌డం వ‌ల్ల ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని అర్థం. కానీ షారుక్ వీడియోను చూసిన కొంత‌మంది నెటిజ‌న్లు ఆయ‌న ల‌తామంగేష్క‌ర్ పాదాల వ‌ద్ద ఉమ్మెశారు అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

sharukh khan latha mangeshkar

sharukh khan latha mangeshkar

అన‌వ‌స‌రంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ప‌లువురు బాలీవుడ్ సెల్ర‌బెటీలు క్లారిటీ ఇస్తున్నారు. షారుక్ ఖాన్ ల‌తా మంగేష్క‌ర్ పాదాల వ‌ద్ద ఉమ్మలేద‌ని….ఆయ‌న పాదాల వ‌ద్ద మాస్క్ ను తీసేసి దేవున్ని ప్రార్థిస్తూ ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఊదార‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Visitors Are Also Reading