Home » నిశ్చితార్థమై 4 నెలలు కావస్తున్నా శర్వానంద్ పెళ్లి ఉసేలేదు… మరి ఏమైనట్టు..!

నిశ్చితార్థమై 4 నెలలు కావస్తున్నా శర్వానంద్ పెళ్లి ఉసేలేదు… మరి ఏమైనట్టు..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు శని ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు.

Advertisement

అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన శర్వా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీల పడిపోయిన శర్వానంద్ కొంతకాలం క్రితం విడుదల అయినటువంటి ఒకే ఒక్క జీవితం మూవీతో మంచి విజయాన్ని అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

Advertisement

ఇలా ఒకే ఒక జీవితం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న శర్వానంద్ నిశ్చితార్థం జనవరి 26 వ తేదీన తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డితో జరిగింది. శర్వా నిశ్చితార్థం జరిగి ఇప్పటికే నాలుగు నెలలు కావస్తున్న ఈ హీరో పెళ్లి ఉసుమాత్రం తెరపైకి రావడం లేదు. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వార్తలు తెరపైకి రావడంతో జనాల్లో అనుమానాలు వస్తున్నాయి.

కాకపోతే శర్వా సన్నిహితుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం శర్వా కు ప్రస్తుతం కాస్త హెల్త్ ప్రాబ్లం ఉండడంతో అందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నట్లు… శర్వా ఆరోగ్యం నయం కాగానే శర్వా … రక్షిత వివాహం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading