Home » శర్వానంద్ కి కాబోయే భార్య ఓ మంత్రి మనవరాలా..? ఆమె గురించి వివరాలు ఇవే !

శర్వానంద్ కి కాబోయే భార్య ఓ మంత్రి మనవరాలా..? ఆమె గురించి వివరాలు ఇవే !

by Bunty
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్ పలు సూపర్ హిట్ సినిమాలతో అభిమానులను సంపాదించుకున్నారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన చిన్న పాత్రలు చేసిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చారు. శర్వానంద్ కెరీర్ లో గమ్యం, రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా, తాజాగా శర్వా పెళ్లికి ఓకే చెప్పేసారని సమాచారం అందుతుంది. అంతేకాదు మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందండోయ్. వధువు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే, శర్వానంద్ కి కాబోయే అమ్మాయి ఎవరనే సమాచారం కొన్ని మీడియా వార్తలు సేకరించాయి. వారి కథనాల ప్రకారం వృత్తిరీత్యా ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్.

Advertisement

కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె మాజీ మంత్రి గారి మనవరాలట. పొలిటికల్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన ఆ అమ్మాయి తాతగారు గతంలో మంత్రిగా చేశారట. ఇక ఆమెతో శర్వానంద్ నిశ్చితార్థం త్వరలో జరగనుందట. సమ్మర్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే వేసవి వరకు ఆగాల్సిందే, లేదా శర్వానంద్ స్పందించాల్సిందే.

read also  : విజయ్ కి బిగ్ షాక్ “వారసుడు” స్టోరీ లీక్.. స్టోరీ కొత్తగా ఉందిగా !

Visitors Are Also Reading