Telugu News » Blog » పఠాన్ కోసం షారుఖ్ భారీ రెమ్యునరేషన్…ఎన్ని కోట్లంటే…?

పఠాన్ కోసం షారుఖ్ భారీ రెమ్యునరేషన్…ఎన్ని కోట్లంటే…?

by AJAY
Ads

ప్రస్తుతం హీరోల రెమ్యునరేషన్ లు వింటే షాక్ అవ్వక తప్పడం లేదు. ఒక్కో హీరో ఒక్కో రేంజ్ లో రెమ్యునరేషన్ లు పుచ్చుకంటున్నారు. క్రేజ్ ను బట్టి నిర్మాతలు రెమ్యునరేషన్ లు ఇవ్వడానికి సైతం ఆలోచించడం లేదు. ఇక తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా కోసం తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Advertisement

షారుఖ్ ఖాన్ కి బాలీవుడ్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. షారుఖ్ కు కేవలం ఇండియా లోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక చివరిగా షారుఖ్ 2018లో జీరో అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా చాలా కాలం గ్యాప్ తరవాత మళ్లీ ఐదేళ్లకు పఠాన్ సినిమాలో నటించాడు. దాంతో పఠాన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Advertisement

ఈ సినిమా ను 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లో జాన్ అబ్రహం కూడా 20 కోట్లు రెమ్యురేషన్ తీసుకోగా హీరోయిన్ గా నటించిన దీపికా 15 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది.