Home » అంత్య క్రియల తర్వాత బయటపడ్డ శరత్ బాబు డైరీ !

అంత్య క్రియల తర్వాత బయటపడ్డ శరత్ బాబు డైరీ !

by Bunty
Ad

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల కొంతమంది మరణిస్తే మరికొంతమంది అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారు. అలా మరణించిన వారిని తలచుకొని సినీ ఇండస్ట్రీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. తాజాగా సీనీ నటుడు శరత్ బాబు కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడి సోమవారం మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తో బాధపడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శరత్ బాబు మరణాన్ని తలుచుకొని చిరంజీవి, బాలకృష్ణ, ఏపీ సీఎం జగన్ పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన మరణం పట్ల సంతాపం తెలియజేశారు. తనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని… తాను చాలా సంతోషంగా ఉన్నానని శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Advertisement

గొప్ప గొప్ప దర్శకులతో తాను నటించానని పేర్కొన్నారు. 70 సినిమాలలో ఆయన హీరోగా చేశారు. ఆయన 250 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ,హిందీ, మలయాళం ఐదు భాషల్లో అద్భుత చిత్రాలను అందించారు. మూడుసార్లు నంది అవార్డును కూడా అందుకున్నారు. అతను ఆముదాలవలస నుంచి వచ్చి దేశవ్యాప్తంగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా శరత్ బాబుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. తనకు ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉందని…అతను సినిమాకష్టాల గురించి, తన కుటుంబం గురించి రాసుకున్నట్లు సమాచారం. అంతేకాదు తాను చివరి రోజుల్లో ఎక్కడ గడపాలని కూడా అందులో రాసుకున్నాడని సమాచారం అందుతోంది.

Advertisement

హార్స్లీ హిల్స్ లో ఇంటిని కట్టుకోవాలని శరత్ బాబు బలంగా కోరుకున్నారట. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర ఊటీగా పిలవబడే హార్స్లీ హిల్స్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఇంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించాలని తెలుస్తోంది. కానీ ఆ పనులు పూర్తికాకముందే శరత్ బాబు కన్నుమూశారు. దీంతో శరత్ బాబు చివరి కోరిక తీరలేదని… ఈ వార్తను కూడా డైరీలో రాసినట్లు వార్తలు వస్తున్నాయి. శరత్ బాబుకు హార్స్లీ హిల్స్లో స్థలం ఉందని, ఆ స్థలంలో 1985లో ఇంటిని నిర్మించాలని అనుకున్నారు. ఇంటి పనులు కూడా మొదలుపెట్టారు. కానీ కొన్ని కారణాల చేత ఆ ఇంటి పనులు మధ్యలోనే ఆపేశారు. దీంతో శరత్ బాబు చివరి కోరిక తీరకుండానే మరణించారని పలువురు ప్రముఖులు బాధపడుతున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Gangavva : చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణలు… తప్పుగా అనుకోవద్దు సార్…

IPL 2023 : ముంబైని గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కు పంత్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను

Visitors Are Also Reading