Home » ఆచార్య నుండి “షానా కష్టం” సాంగ్ రిలీజ్…కుమ్మేసిన మెగాస్టార్…!

ఆచార్య నుండి “షానా కష్టం” సాంగ్ రిలీజ్…కుమ్మేసిన మెగాస్టార్…!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ఆ. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించారు. సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటించారు. అదేవిధంగా రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Sana kastam song

Sana kastam song

అందులో లాహే లాహే పాట శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సినిమా లోని “షానా కష్టం” అంటూ సాగే ఐటమ్ పాటను విడుదల చేయగా ఈ సాంగ్ లో టాలీవుడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేసింది. చిరు ఈ పాటలో తనదైన స్టైల్ లో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. మరి ఈ పాట యూట్యూబ్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

 

Visitors Are Also Reading