షమీ ఆట గురించి ప్రక్రియ గురించి చెప్పక్కర్లేదు. వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా సీనియర్ బౌలర్ షమీ ఏ విధంగా రాణించారో మనం చూసాం. షమీ తొలి నాలుగు మ్యాచ్లు ఆడకపోయినా హార్దిక్ పాండ్యా దూరం అవ్వడంతో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ నుండి షమీకి ప్రపంచకప్ లో ఆడే ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని చెయ్యి జార్చుకోలేదు. సద్వినియోగం చేసుకున్నాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు కేవలం ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.
Advertisement
రెండు మ్యాచ్లలో అయితే ఐదు వికెట్లని పడగొట్టాడు కానీ చీలమండగాయంతో బాధపడడం వలన వన్డే ప్రపంచ కప్ టైం లో ఆ తీవ్రమైన నొప్పిని తట్టుకోలేకపోయాడు రోజు ఇంజక్షన్స్ తీసుకునేవాడు ఈ విషయాన్ని బెంగాల్ జట్టులోని శమీ మాజీ సహచరుడు వెల్లడించారు ఇలా ప్రపంచకప్ టోర్నీ మొత్తం షమీ గాయంతో బాధపడ్డాడని నొప్పిని భరించడానికి ప్రతిరోజు ఇంజక్షన్ తీసుకున్నాడని, వయసు పెరుగుతున్న కొద్ది గాయాలు నయం కావాలంటే, సమయం పడుతుందని అతను చెప్పారు. హార్దిక్ పాండ్యా గాయం తర్వాత షమీ కి ప్రపంచకప్ లో ఆడే అవకాశం వచ్చిందని ధర్మశాలలో న్యూజిలాండ్ తో మొదటి మ్యాచ్ ఆడి ఐదు వికెట్లు తీసి చరిత్రను సృష్టించాడు షమీ.
Advertisement
తర్వాత ఇంగ్లాండ్ పై నాలుగు, శ్రీలంక పైన ఐదు, దక్షిణాఫ్రికా పై రెండు వికెట్లను పడగొట్టాడు. ఫైనల్లో షమీ ఆస్ట్రేలియ పై ఒక వికెట్ మాత్రమే తీగలిగాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. ఈ విధంగా షమీ ప్రపంచకప్ లో ఏడు మ్యాచ్ లలో 24 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ఫాస్ట్ బౌలర్ షమిని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. టీం ఇండియా మిస్ చేసుకుందని ఆయన చెప్పారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!